Begin typing your search above and press return to search.
అతగాడి గ్యాస్ తో ఎమర్జెన్సీ ల్యాండింగ్
By: Tupaki Desk | 18 Feb 2018 7:22 AM GMTకొన్ని విషయాలు అస్సలు పెద్దవిగా అనిపించవు. ఎప్పుడైతే వాటిని ఫేస్ చేస్తామో అప్పుడే వాటి ఇబ్బంది ఏమిటో అర్థమవుతుంది. తాజాగా అలాంటి పరిస్థితే డచ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమాన ప్రయాణికులకు ఎదురైంది. ఇక పెద్దాయన జీర్ణకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఫ్టైట్ జర్నీలో తన ప్రమేయం లేకుండానే గ్యాస్ రిలీజ్ అయిపోతోంది.
తన కంట్రోల్ లేకుండా రిలీజ్ అవుతున్న గ్యాస్ తో.. ఫ్టైట్ లో ఆయన పక్కన కూర్చున్న ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. పదే పదే గ్యాస్ వదులుతున్న వైనంతో తాము తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్న విషయాన్ని చెప్పిన ప్రయాణికులు సొల్యూషన్ కావాలంటూ పట్టుబట్టారు.
అప్పటికే ఆకాశంలో ఉన్న విమానాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి విమాన సిబ్బందికి ఎదురైంది. ఇంతకూ ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. దుబాయ్ నుంచి అమస్టర్ డామ్ కు వెళుతున్న డచ్ ఎయిర్ లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. అదే పనిగా గ్యాస్ వదులుతున్న వైనంపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో.. వారి రచ్చ అంతకంతకూ పెరిగి.. పైలెట్ కు పెద్ద తలనొప్పిగా మారింది.
ప్రయాణం మధ్యలో ఏం చేయాలో పాలుపోని పైలెట్ కు ప్రయాణికుల గొడవ చికాకుగా మారింది. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఆయన.. గ్యాస్ వదులుతున్న ప్రయాణికుడి తీరుకు గోల చేస్తున్న నలుగురు ప్రయాణికుల్ని దించేశారు. అయితే.. ఈ ఎపిసోడ్ కు కీలకమైన గ్యాస్ వదిలే వ్యక్తిని ఏం చేశారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయంపై మాత్రం వివరాలు బయటకు రాలేదు.