Begin typing your search above and press return to search.

ట్రంప్ ప్రాక్టీస్ ఎంతన్నది బయటకు వచ్చింది

By:  Tupaki Desk   |   2 March 2017 9:58 AM GMT
ట్రంప్ ప్రాక్టీస్ ఎంతన్నది బయటకు వచ్చింది
X
ప్రతిది లైట్ గా తీసుకున్నట్లు కనిపిస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్నట్లుగా కనిపించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో కొత్త కోణం ఒకటి బయటకు వచ్చింది. తాను నమ్మిన విషయం పట్ల తానెంత బలంగా ఉంటారన్న విషయంతో పాటు.. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించేందుకు అతగాడు పడే తపన అంతాఇంతా కాదు. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటికీ.. అనుక్షణం అప్రమత్తంగా ఉండటమే కాదు.. తన బాధ్యతల్ని నిర్వర్తించటం.. అందులో తన మార్క్ ను చూపించటం కోసం అతడెంత కష్టపడతాడన్న విషయం ఒకటి బయటకు వచ్చింది.

ట్రంప్ లో కూడా మంచి లక్షణాలు ఉంటాయా? అతడి నుంచి కూడా నేర్చుకోవాల్సినవి ఉంటాయా? అంటూ కొందరు క్వశ్చన్ చేయొచ్చు కానీ.. ఈ ఉదంతం గురించి వింటే.. తాను చేసే పని పట్ల ట్రంప్ కున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయం అర్థమవుతుంది.

తొలిసారి అమెరికన్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించటం.. ఈ సందర్భంగా తన తీరుకు భిన్నంగా ఆచితూచి మాట్లాడిన ఆయన మాటలు చాలామందిని ఆకర్షించటంతో పాటు.. ఆన్ లైన్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో దాదాపు 60 శాతానికి మించిన అమెరికన్లు ట్రంప్ ప్రసంగం బాగుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

అమెరికన్ కాంగ్రెస్ లో తన ప్రసంగానికి ముందు కారులో ప్రయాణిస్తున్న సందర్భంగా ట్రంప్.. తన ప్రసంగ ప్రతుల్ని సరి చూసుకుంటూ.. ప్రాక్టీస్ చేసుకోవటం కనిపించింది. తన ప్రపంచం ప్రభావవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో.. ప్రసంగానికి ముందు సమయంలోనూ ప్రాక్టీస్ చేసిన వైనం మీడియా కంట్లో పడింది. దీనిపై ప్రచురితమైన వార్తలకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ కనిపించింది. ఇంత వయసులోనూ.. పని పట్ల ట్రంప్ కమిట్ మెంట్ ను మెచ్చుకోవాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/