Begin typing your search above and press return to search.

హైదరాబాదీస్... నోట్ దిస్ పాయింట్

By:  Tupaki Desk   |   13 March 2016 4:19 AM GMT
హైదరాబాదీస్... నోట్ దిస్ పాయింట్
X
మీరు సెకండ్ హ్యాండ్ వెహికిల్ వాడుతున్నారా? అయితే.. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు కానీ.. సెకండ్ హ్యాండ్ వెహికిల్ వాడుతుంటే.. మీవాహనాన్ని పాత యజమాని పేరు మీద నుంచి మీ పేరు మీదకు బదిలీ చేసుకున్నారా? లేదా? ఒకవేళ చేసుకొని ఉండకపోతే అర్జెంట్ గా చేసుకోండి. ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేసినా.. చింతించాల్సి వస్తుంది.

ఎందుకంటే.. శాంతిభద్రతల్లో భాగంగా తెలంగాణ పోలీసులు తాజాగా కొత్త డ్రైవ్ షురూ చేశారు. సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ కొనుగోలు చేసిన వారు.. ఆ వాహనాన్నితమ పేరు మీద బదిలీ చేసుకోకుండా.. పాత పేరు మీదనే కంటిన్యూ అవుతున్న విషయాన్ని పోలీసులు తమ తనిఖీల్లో గుర్తిస్తే సదరు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక.. ఆ వాహనంపై ఆ యజమాని ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటివరకూ ఈ నిబంధనను అమలు చేసి 500 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు.

మార్చి 5 వరకు వాహనాల యాజమాన్య బదిలీకి అవకాశం ఇచ్చిన పోలీసులు మార్చి 6 నుంచి వాహనాల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ కొనేవారు ఆచితూచి వ్యవహరించాలి. నిర్లక్ష్యంతో వాహన రిజిస్ట్రేషన్ విషయంలో పట్టించుకోకుంటే వెంటనే యాజమాన్య హక్కును బదిలీ చేసుకోవాల్సిందే. లేకుంటే మాత్రం.. వెహికిల్ మీద ఆశలు వదులుకోక తప్పదంతే.