Begin typing your search above and press return to search.

జంబలకిడి పంబ.. రిపీట్ అయ్యింది..

By:  Tupaki Desk   |   7 Aug 2019 5:30 PM GMT
జంబలకిడి పంబ.. రిపీట్ అయ్యింది..
X
సీనియర్ నరేష్ హీరోగా, ఆమని హీరోయిన్ గా వచ్చిన ‘జంబలకిడి పంబ’ సినిమా చూడని తెలుగు జనాలు ఉండరు. అందులో అబ్బాయిలు అమ్మాయిలుగా.. అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోయి చిత్రవిచిత్ర వేషాలతో కామెడీ పండిస్తారు. అచ్చంగా అలాంటి సంఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది.

ఉత్తర కోల్ కతా శివారు మహజాతినగర్ లో ‘సుశాంతో ’ అనే బాలుడు ఉండేవాడు. సగటు మధ్యతరగతి కుటుంబం. అయితే పురుషుడిగా పుట్టినా ఆ లక్షణాలు మాత్రం సుశాంతో లో రాలేదు. ఇంటర్ కు వచ్చేసరికి ఆడపిల్లగా బట్టలు వేసుకొని వారితోనే స్నేహం చేయడం మొదలుపెట్టాడు. అయితే అతడిని అందరూ ఏడిపించడం.. లైంగిక వేదింపులు ఎక్కువయ్యాయి. దీంతో తల్లిదండ్రులు పురుషుడిలా ఉండమని ఒత్తిడి చేశారు. ఇది తట్టుకోలేక బయటకు వచ్చి ట్రాన్స్ జెండర్ గా మారాడు సుశాంతో. తన పేరును ‘ తిస్తాదాస్’గా మార్చుకున్నాడు. ట్రాన్స్ జెండర్ ప్రిన్సిపాల్ డాక్టర్ మనాబి బంధోపాధ్యాయ్ ప్రోత్సాహంతో ‘సక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ’ చేయించుకొని తిస్తాదాస్ గా మారాడు. ఆ తర్వాత తిస్తా కోల్ కతా సినిమా పరిశ్రమలో ఒక నటిగా ప్రవేశం పొందాడు. సినిమాలో ట్రాన్స్ జెండర్ గా నిరూపించుకొని పాపులర్ అయ్యాడు.

ఇక అస్సాకు చెందిన చక్రవర్తితో సుశాంతోకు పరిచయం అయ్యింది అది ప్రేమగా మారింది. అయితే ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. చక్రవర్తి చిన్నప్పుడు ఒక ఆడపిల్ల..అయితే ఈమెలో మగలక్షణాలు ఎక్కువ. ఆడవారి లక్షణాలు లేకపోవడంతో మగవాడిగా మారాలనుకున్నాడు. దీంతో చక్రవర్తి కూడా ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్ మాన్ గా మారాడు. వీరిద్దరూ జాతీయ ట్రాన్స్ జెండర్ దినోత్సవమైన ఏప్రిల్ 15న పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.

ఇలా పురుషుడు అయిన మనిషి స్త్రీ మారాడు. ఇక స్త్రీ ఏకంగా పురుషుడిగా మారాడు. అంటే జంబలకిడి పంబ అయ్యింది. ఇది దేశంలో ప్రముఖ వార్త అయ్యింది. అందరూ దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. తిస్తాదాస్ ను మాత్రం తప్పుపడుతున్నారు. పూర్తిస్థాయి మగాన్ని పెళ్లి చేసుకుంటే పోయేది కదా అని విమర్శిస్తున్నాడు. పురుషుడిగా మారిన స్త్రీని చేసుకుంటే ఏముంటుందని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా దేశంలో ఇలా లింగమార్పిడిలు చేయించుకున్న ఇద్దరు స్త్రీ పురుషుల పెళ్లి చర్చనీయాంశంగా మారింది.