Begin typing your search above and press return to search.

ఓలాకు భారీ షాక్.. క్యాబ్స్ పై నిషేధం

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:34 PM GMT
ఓలాకు భారీ షాక్.. క్యాబ్స్ పై నిషేధం
X
ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ఓలాకు తాజాగా భారీ షాక్ తగిలినట్టు తెలిసింది. ట్రాన్స్ పోర్ట్ ఫర్ లండన్ (టీఎఫ్ఎల్) తాజాగా ఓలా క్యాబ్స్ పై నిషేధం విధించినట్టు సమాచారం. ఆపరేటర్ లైసెన్స్ ను రద్దు చేసినట్టు తెలిసింది.

ఓలా క్యాబ్స్ లో చాలా తప్పులు.. పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయని..వీటి వల్ల ప్రజలు సేఫ్టీ రిస్క్ లో పడే అవకాశం ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీఎఫ్ఎల్ పేర్కొంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవర్లు క్యాబ్స్ నడపడం సహా ప్రజల సేఫ్టీ చూడడం లేదని వివరించింది.

ఇక ఈ క్రమంలోనే లండన్ ప్రైవేట్ హైర్ వెహికల్ ఆపరేట్స్ తాజాగా కొత్తగా ఓలాకు లైసెన్స్ ఇవ్వడానికి టీఎఫ్ఎల్ తెలిపింది. ప్రజల రక్షణను ప్రమాదంలో పెట్టలేమని.. అందుకే ఈ లైసెన్స్ ఇవ్వడం లేదని పేర్కొంది. ఓలాలో చాలా పొరపాట్లు ఉన్నాయని వివరించింది.

కాగా ఓలా క్యాబ్స్ లండన్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇకపోతే ఓలాకు టీఎఫ్ఎల్ నిర్ణయంపై అప్పీలు చేసుకునేందుకు 21 రోజుల గడువును ఇచ్చారు.

ఇక లండన్ టీఎఫ్ఎల్ నిర్ణయంపై ఓలా స్పందించింది. లేవనెత్తిన సమస్యలు పరిష్కరిస్తామని.. టీఎఫ్ఎల్ తో కలిసి పనిచేస్తామని.. లండన్ లో ఓలా క్యాబ్స్ తో ప్రయాణికులకు సురక్షితమైన సర్వీసులు అందిస్తామని.. ప్రజల సేఫ్టీ చూసుకోవడం తమ బాధ్యత అని టీఎఫ్ఎల్ తెలిపింది.