Begin typing your search above and press return to search.
వైరల్ షాక్: ఎంత దారుణంగా కొట్టారంటే?
By: Tupaki Desk | 29 July 2019 9:22 AM GMTఏం తప్పు చేశాడో తెలీదు? ఎందుకు శిక్షిస్తున్నారో సమాచారం లేదు. కాకుంటే.. 23 ఏళ్ల విక్కీ అనే వ్యక్తిని దారుణంగా హింసిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక ప్రముఖ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ వీడియోకు సంబంధించిన వివరాలు తక్కువగా ఉన్నాయి.
వారు పేర్కొన్న దాని ప్రకారం.. విక్కీ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతడేదో తప్పు చేశాడని.. దానికి గుణం పాఠం చెప్పేందుకు అనుసరించిన పద్ధతి అనాగరికంగా ఉండటమే కాదు.. జంతువుల విషయంలో కూడా ఇలా చేయరన్న భావన కలగటం ఖాయం.
రెండు కాళ్లను కట్టేసి.. తాడును ప్రైవేట్ పార్ట్స్ గుండా చేతులు కట్టేసి.. మనిషిని ఎత్తుగా ఉన్న రాడ్ కు వేలాడి తీశారు. అక్కడితో ఆగక.. బెల్ట్ తో అతన్ని కొట్టటం వీడియోలో కనిపించింది. ఒంటి మీద డ్రాయర్ తప్పించి మరెలాంటి దుస్తులు లేవు. తొలుత బెల్ట్ తో కొట్టి.. ఎత్తుగా వేలాడతీయటంతో కొట్టేందుకు అనువుగా లేకపోవటంతో కిందకు దించి మరీ హింసించినట్లుగా తెలుస్తోంది.
విక్కీని హింసించిన వ్యక్తులు అఖిల్.. అమిత్ లుగా గుర్తించారు. వారు సదరు ట్రాన్స్ పోర్టు సంస్థ నిర్వాహకులుగా భావిస్తున్నారు. పశువులను సైతం హింసించని రీతిలో సాటి మనిషిని హింసించిన వైనం వైరల్ గా మారటమే కాదు.. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ కారణంతో విక్కీని అంత అనాగరికంగా హింసించారన్న విషయంపై స్పష్టత రాలేదు.