Begin typing your search above and press return to search.

అండర్ వేర్లతో మెట్రోలో ప్రయాణం…ఎందుకోమంటే?

By:  Tupaki Desk   |   9 Jan 2023 11:30 PM GMT
అండర్ వేర్లతో మెట్రోలో ప్రయాణం…ఎందుకోమంటే?
X
చుట్టురా వందల మంది ప్రయాణీకుల మధ్యలో ప్యాంటు లేకుండా అండర్ వేర్ తో ప్రయాణించాల్సి వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి పుట్టిందే ‘నో ప్యాంట్స్ సబ్ వే రైడ్’. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్యాంట్ లేకుండా మెట్రోలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొనే ఆడ.. మగవాళ్లకు కొన్ని రూల్స్ కూడా ఉండటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. యూరప్ కు చెందిన చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వే ‘నో ప్యాంట్ సబ్ వే రైడ్’ను మొదలు పెట్టింది. గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిరాటకంగా కొనసాగుతోంది. చివరగా 2020లో జనవరి 11న పరాగ్వేలో ఈ కమ్యూనిటీ చెందిన వారంతా ప్యాంట్ విప్పేసి అండర్ వేర్ లతో దాదాపు గంటపాటు మెట్రో రైళ్లలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కరోనా కారణంగా వాయిదా పడుతూ గత కొన్నేళ్లుగా ‘నో ప్యాంట్ సబ్ వే రైడ్ ’ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో రైళ్లలో ప్రయాణికులు యథావిధిగా ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నో ప్యాంట్ సబ్ వే రైడ్ గ్రూప్ మెంబర్లు తాజాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

'నో ట్రౌజర్స్ ట్యూబ్ రైడ్' పేరిట 2002లో ఈ కార్యక్రమానికి కొంతమంది శ్రీకారం చుట్టారు. దీనికి సబ్ వే అధికారుల మద్దతు కూడా తోడవడంతో ప్రతీయేటా ఈ అర్థనగ్న ప్రదర్శన నిరాటంకంగా కొనసాగుతోంది. అయితే ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి. సూటూ బూటూ వేసుకుని.. చక్కగా టై కట్టుకుని ప్యాంటు సంగతి మాత్రం మరచిపోవాలి. అబ్బాయిలైతే ప్యాంట్లు.. అమ్మాయిలైతే స్కర్ట్ లు వేసుకోకూడదు.

ది స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే ముందుగా సదరు క్లబ్ లో మెంబర్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ అర్ధనగ్న ప్రదర్శన వెనుక పెద్ద ఉద్దేశ్యం ఉందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ ఈవెంట్ ను కేవలం సరదా కోసమే 'నో ట్రౌజర్స్ ట్యూబ్ రైడ్' గ్రూప్ మెంబర్స్ చేస్తున్నారు. నిండుగా కప్పుగా ప్రయాణిస్తే మజా ఏముటుంది.. విప్పుకుని తిరగడంలోనే కదా అసలైన కిక్కు ఉంటుందని వారు చెబుతుండటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.