Begin typing your search above and press return to search.

తెలంగాణ ఆస్పత్రిలో దారుణం.. కరోనా సోకిన డాక్టర్‌ తో భాదితులకు ట్రీట్మెంట్ !

By:  Tupaki Desk   |   11 Sep 2020 1:30 AM GMT
తెలంగాణ ఆస్పత్రిలో దారుణం.. కరోనా సోకిన డాక్టర్‌ తో  భాదితులకు ట్రీట్మెంట్ !
X
కరోనా వైరస్‌ ను ఇంకా చాలామంది సీరియస్ గా తీసుకోలేదు. కొందరు తమకు కరోనా సోకిన విషయాన్ని కూడా బయటకు చెప్పకుండా రోడ్డు పై యధేచ్చగా తిరుగుతున్నారు. అలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ , వారితో పాటుగా ఇతరులకి వారికి కూడా వైరస్ అంటిస్తున్నారు. ఈ జనగామ జిల్లా ఆస్పత్రిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకిన వైద్యుడి తో రోగులకు అధికారులు చికిత్స చేయించారు. జిల్లా ఆస్పత్రి లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ గా పనిచేసే ఓ యువ వైద్యుడికి కరోనా సోకింది. అయితే , చెబుతున్న వినకుండా బలవంతంగా అతనితో రోగులకు చికిత్స చేయిస్తున్నారు.

పూర్తి వివరాలు చూస్తే .. కరోనా సోకిన వైద్యుడితో రోగులకు అధికారులు చికిత్స చేయించారు. జిల్లా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ గా పనిచేసే ఓ యువ వైద్యుడికి కరోనా సోకింది. కరోనా వచ్చిందన్న విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పాడు. అయితే అతడి మాట లెక్క చేయకుండా డ్యూటీ చేయాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చేసేదేమీలేక ఆ వైద్యుడు విధులు నిర్వర్తించాడు. అయితే కరోనా సోకిన వైద్యుడిని క్వారంటైన్ ‌కు పంపించాల్సిన అధికారులు, డాక్టర్ ‌తో డ్యూటీ చేయించడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ విషయం తెలిసిన రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం పోసిన డాక్టర్లే ఇలాంటి పనులు చేస్తుంటే ఇక మమ్మల్ని కాపాడేది ఎవరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకిన డాక్టర్ క్వారంటైన్‌ కు పంపించాల్సిన అధికారులు.. డాక్టర్ ‌తో డ్యూటీ చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.