Begin typing your search above and press return to search.

అమెరికాలో ట్రెక్కింక్ .. 200 అడుగుల ఎత్తు నుంచి పడి తెలుగు టెక్కీ మృతి

By:  Tupaki Desk   |   18 Oct 2022 6:38 AM GMT
అమెరికాలో ట్రెక్కింక్ .. 200 అడుగుల ఎత్తు నుంచి పడి తెలుగు  టెక్కీ మృతి
X
అమెరికాలో మరో తెలుగు వాడు దుర్మరణం చెందాడు. విహార యాత్ర కాస్తా విషాదంతో ముగిసింది. అమెరికాలో ట్రెక్కింగ్ వెళ్లి ప్రమాదవశాత్తూ తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన గుంటూరు వాసి 'గంగూరి శ్రీనాథ్' (32) మృతిచెందాడు. ఆయన మృతి విషాదం నింపింది. శ్రీనాథ్ మరణవార్త తెలియగానే గుంటూరులో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు-రాజశ్రీ దంపతుల కుమార్తె సాయిచరణితో ఇదే శ్రీనాథ్ కు ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. గతంలో ఫ్లోరిడాలో ఉన్న వీరు ఆరు నెలల క్రితం అట్లాంటాకు మారారు.

ఆదివారం సెలవు కావడంతో గడిపేందుకు శ్రీనాథ్ దంపతులు అట్లాంటాలోని ట్రెక్కింక్ కు వెళ్లారు. క్లీవ్ లెన్స్ మౌంటేన్ హిల్స్ లో ఎత్తైన ప్రదేశానికి వెళ్లిన శ్రీనాథ్ ప్రమాదవశాత్తూ 200 అడుగుల ఎత్తునుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

శ్రీనాథ్ మరణ వార్త ఆయన తల్లిదండ్రులు మల్లేశ్వరి, బాబూరావులకు తెలియడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరుకు తీసుకువచ్చేందుకు వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అమెరికాలో ఉంటున్న గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, గుంటూరు ప్రవాసాంధ్రులు బాధిత కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో శ్రీనాథ్ మాస్టర్స్ చేశాడు. మిన్నెసోటాలో ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా చేరాడు. ప్రస్తుతం ఇంజినీర్ గా చేస్తూ విహార యాత్రలో చనిపోవడం విషాదం నింపింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.