Begin typing your search above and press return to search.

వణికించే స్తున్న తాలిబన్-2.0.. బద్రి 313

By:  Tupaki Desk   |   30 Aug 2021 7:30 AM GMT
వణికించే స్తున్న తాలిబన్-2.0.. బద్రి 313
X
తాలిబన్ల దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అధికారికంగా ఆఫ్ఘనిస్ధాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక మునుపే యావత్ ప్రపంచ దేశాల్లో ఏదో ఓ కారణంగా తాలిబన్ అంటే వణికిపోతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల అధినేతలు ఆఫ్ఘన్ పరిణామాల చెమటలు పట్టిస్తున్నాయి. ఐఎస్ఐఎస్ (ఐసిస్) కారణంగా ఇప్పటికే గల్ఫ్ లోని చాలా దేశాలు ఏదో రూపంలో భారీగా నష్టపోయున్నాయి.

ఇపుడు తాలిబన్లు కొత్తగా తయారవ్వటం పైగా బద్రి 313 దళం ఏర్పాటవ్వటాన్ని తట్టుకోలేకపోతున్నాయి. బద్రి 313 అంట ఏమిటి ? ఏమిటంటే తాలిబన్లలోనే అత్యంత ఆధునిక ఆయుధాలను ఉపయోగించగలిగిన దళం అన్నమాట. ఒకపుడు తాలిబన్ల దగ్గర ఎప్పుడో 70 ఏళ్ళ క్రిత తయారైన ఏకే 47, ఏకే 56 తుపాకులే ఉండేవి. కానీ ఈ మధ్య అందులోను గడచిన 15 రోజుల్లో వీరికి కూడా అత్యంత ఆధునికమైన ఆయుధాలు వచ్చి చేరాయి.

చైనా, పాకిస్థాన్ తో పాటు అమెరికా ఆఫ్ఘన్లో వాడకానికి తెచ్చుకున్న ఆధునిక ఆయుదాల్లో చాలావరకు తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారట. వీటిన్నింటిని ఉపయోగించటంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్న దళాన్ని బద్రి 313 అని తాలిబన్ల కొత్త పేరుపెట్టారు. పవిత్ర ఖురాన్ లో చెప్పినట్లుగా బద్ర్ యుద్ధానికే ఇఫుడు తాలిబన్లు బద్రి 313 అని పేరుపెట్టారు. మహ్మద్ ప్రవక్త 313 మంది శక్తివంతమైన సైనికులతో శత్రువులపై విజయం సాధించారట. అందుకనే కొత్తగా ఏర్పాటు చేసుకున్న దళానికి బద్రి 313 అని పేరు పెట్టుకున్నారు.

ఈ దశంలోని ఫైటర్లంతా చూడటానికి అమెరికానో లేకపోతే బ్రిటన్ సైనికులే అనిపించేట్లుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాడే అధునాతన సైనిక డ్రస్సులనే వాళ్ళూ వాడుతున్నారు. అమెరికా, బ్రిటన్ సైనికులు వాడే ఆయుధాలే వీళ్ళ చేతుల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఫైటర్లు ప్రస్తుతం తాలిబన్ల దగ్గర ఎంతమందున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. అందుకనే యావత్ ప్రపంచం ముఖ్యంగా గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి.

తాలిబన్లకు ఐసిస్ లోని ఓ బలమైన వర్గంతో పాటు ఇరాన్, ఇరాక్, సిరియా లాంటి దేశాల్లోని స్ధానిక తీవ్రవాదులు ఎక్కడ చేతులు కలుపుతారో అనే టెన్షన్ పెరిగిపోతోంది. 20 ఏళ్ల తో పోల్చుకుంటే ఇపుడు తాలిబన్లు ఆయుధాల ప్రయోగంలో బాగా ఆరితేరిపోయారు. అమెరికా దగ్గర ఉన్నంత అత్యాధునిక ఆయుధాల్లో చాలావరకు ఇపుడు తాలిబన్ల దగ్గరున్నాయి. అందుకనే రేపు 31 తర్వాత మిగిలిన దేశాల విషయంలో తాలిబన్లు ఎలా వ్యవహరించబోతున్నారో అర్ధం కాక టెన్షన్ పెరిగిపోతోంది.