Begin typing your search above and press return to search.

ఢీ కొట్టడానికి నడిరోడ్డుపై వీరంగం.. నానా రచ్చ.. చివరకు ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   2 Aug 2021 8:30 AM GMT
ఢీ కొట్టడానికి నడిరోడ్డుపై వీరంగం.. నానా రచ్చ.. చివరకు ఏమైందంటే ?
X
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా కూడా క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది. తాజాగా సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ లో నడిరోడ్డుపై ఓ యువతి చేసిన రచ్చ వీడియో సోషల్‌ మీడియాను కుదిపిస్తోంది. #ArrestLucknowGirl హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అరెస్టు లక్నోగర్ల్.. ఆ లక్నో అమ్మాయిని అరెస్టు చేయండి హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. లక్నోలోని అవధ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

ఓ వ్యక్తిని నడిరొడ్డులో ఓ యువతి కొడుతూ ఉండడం అందులో ఉంది. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తో సహా అక్కడున్నవాళ్లంతా ఆ తతంగం చూస్తూ ఉండిపోయారు. కారణం అడుగుతుంటే ఆ వ్యక్తి ఫోన్‌ ను లాక్కుని మరీ పగలకొట్టింది. అడ్డొచ్చిన మరో వ్యక్తిని కాలర్‌ లాగి మరీ కొట్టింది. ఈ టైంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌ కాగా.. వెనకాల ఉన్న చాలామంది ‘ఆ అమ్మాయికి బుద్ధుందా?’ అంటూ వెనకాల నుంచి అరవడం వినొచ్చు. అయినా పట్టించుకోకుండా ఆ అమ్మాయి ఎగరి ఎగిరి మరీ ఆ వ్యక్తిని కొడుతూనే ఉంది. మధ్యలో వచ్చిన వ్యక్తిని నీకేం పనిరా అంటూ మరీ బాదింది. ఇక తనను ఢీకొట్టిన కారణంగానే ఈ పని చేసినట్లు ఆ యువతి అందులో మాట్లాడినట్లు ఉంది.

ఆ అమ్మాయి స్థానంలో ఒక వ్యక్తి ఉంటే, ఇలాగే ఉంటామా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోని గుంపులోని ప్రేక్షకుల్లో ఒకరు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. వీడియోలోని అమ్మాయి డ్రైవర్‌ను అతని కాలర్‌ తో లాగుతూనే ఉంది. మహిళా పోలీసు సిబ్బందిని పిలిచి సమస్యను పరిష్కరించమని అభ్యర్థించింది.ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ.. ‘మేఘ్‌ అప్‌ డేట్స్‌’ అనే ట్విటర్‌ పేజీ నుంచి ఈ వీడియో సర్క్యూలేట్‌ అయ్యింది. ఇక ఈ ఘటనలో ఆ యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ అమ్మాయిని అరెస్ట్‌ చేయాలంటూ ట్వీట్లు చేస్తుండగా.. ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో హ్యాష్‌ ట్యాగ్‌ కొనసాగుతోంది.