Begin typing your search above and press return to search.
ట్రెండింగ్ మెమె: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల బాధ ఇదీ
By: Tupaki Desk | 11 April 2019 6:04 PM GMTప్రస్తుతం అందరి ఫోకస్ ఎన్నికల మీదే.. క్రికెట్, ఇతర వ్యాపకాలు అన్నీ పక్కనపెట్టి మరీ దేశం, రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే దానిమీదే ఫోకస్ పెట్టారు. ఏ ఇద్దరు కలిసినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీ ఏ హామీలు ఇచ్చిందనే దానిపైనే చర్చ. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఎన్నికల వేళ పార్టీల హామీలపై తమదైన శైలిలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ‘సాఫ్ట్ వేర్ ప్రపంచం’ అనే సోషల్ మీడియా యాక్టివిస్టులు తాజాగా విడుదల చేసిన ఒక మెమె వైరల్ గా మారింది. మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంలో రోడ్లు, ఊరిని బాగు చేయడం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్న మహేష్ బాబు చిత్రాలను కట్ చేసి తమ క్రియేటివిటీతో పార్టీలకు పంచ్ విసిరారు.
దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం రైతులమీదే వరాల జల్లు కురిపిస్తున్నాయి. రుణమాఫీ పేరిట వారికి వరాలు కురిపిస్తున్నారు. దీన్నే అస్త్రంగా చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమ క్రియేటివిటీతో తమకు అన్వయించుకున్నారు. రైతులకు రుణమాఫీ చేసినట్టే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు బాకీలు మాఫీలు చేయాలని.. ఉచితంగా క్రిడిట్ కార్డు బిల్స్ కట్టాలని.. లోన్లు మాఫీ చేయాలని సెటైర్లు వేశారు. చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు బ్యాంకులకు అప్పులు కట్టలేక.. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేక.. చాలా కష్టపడుతున్నారని అర్థం వచ్చేలా రూపొందించారు. అసలే జీతాలు పెరగక.. వేరే చోట ఉద్యోగాలు లేక అలిసిపోయిన సాఫ్ట్ వేర్ బతుకులు ఇలా ఆశిస్తున్నాయని వారు మెమె తయారు చేశారు.
మహేష్ బాబు శ్రీమంతుడు సీన్ ను సాఫ్ట్ వేరర్లు తమకు అన్వయించుకొని ఇలా మెమె తయారు చేయడం.. తమ గురించి కూడా ఆలోచించి రుణమాఫీ మాకు చేయాలని కోరడం ఆసక్తి రేపుతోంది. మరి రైతులు, ఇతర వర్గాల వారిపై వరాల వాన కురిపిస్తున్న పార్టీలు ఇప్పుడైనా కనీసం తమ గురించి ఆలోచించాలని వేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వేసిన ఈ మెమెపై పార్టీలు స్పందిస్తాయో లేదో చూడాలి.