Begin typing your search above and press return to search.

టీడీపీ-జనసేన మధ్య ట్రయల్ రన్ మొదలైందా ?

By:  Tupaki Desk   |   22 Sep 2021 11:30 AM GMT
టీడీపీ-జనసేన మధ్య ట్రయల్ రన్ మొదలైందా ?
X
ఎప్పుడో అవుతుందనుకున్న ముచ్చట ఇపుడే తీరిపోయినట్లుంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య కటీఫ్ అయిపోతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. బీజేపీతో టాటా చెప్పేయగానే తెలుగుదేశంపార్టీతో జనసేన కలిసిపోతుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లే కమలనాదులకు, జనసేన నేతలకు మధ్య సఖ్యత, సహకారం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండుపార్టీల నేతలు ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్లుగా సాగుతున్నారు.

ఈ నేపధ్యంలోనే రెండుపార్టీల మధ్య పొత్తు చిత్తవుతుందనే ప్రచారం రెగ్యులర్ గా జరుగుతోంది. విచిత్రమేమిటంటే పొత్తుల చిత్తుపై ఎంత ప్రచారం జరుగుతున్నా రెండు పార్టీల నేతల నుండి ఖండనలు కూడా రావటంలేదు. దాంతో ఏదోరోజు రెండుపార్టీలు విడిపోవటం ఖాయమనే అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఆచంట, రాజమండ్రి లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసిపోతున్నాయి.

ఉదాహరణకు ఆచంటలో ఓ మండలంలో 17 ఎంపీటీసీలున్నాయి. వీటిల్లో ఏ పార్టీకి మెజారిటి వస్తే ఆ పార్టీదే మండల పరిషత్ ప్రెసిడెంట్ పదవి. అయితే టీడీపీకి 8 ఎంపిటీసీలు, వైసీపీకి 5, ఎంపీటీసీలు, జనసేనకు నాలుగు స్ధానాలు వచ్చాయి. వైసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ టీడీపీ+జనసేన కలవబోతున్నాయి. ఈ విషయాన్ని టీడీపీ నేతలు బాహాటంగానే ప్రకటించేశారు.

ఇదే విషయమై రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతు తమ రెండు పార్టీల మధ్య ఎక్కుడ సహకారం అవసరమైతే అక్కడంతా ఏకమవుతాయని స్వయంగా ప్రకటించారు. గోరంట్ల తాజా ప్రకటనతో రెండు పార్టీల మధ్య అవగాహన, సఖ్యత చక్కగానే కుదరినట్లు అర్ధమవుతోంది. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో పొత్తుకు ఇప్పటి సహకారం జస్ట్ ట్రయల్ రన్ లాగే ఉందని అనిపిస్తోంది. కాబట్టి వచ్చే ఎన్నికలనాటికి చంద్రబాబునాయుడుకు పార్టనర్ ఇప్పుడే సెట్ అయిపోయినట్లే ఉంది.

అంతా బాగానే ఉంది కానీ మరి బీజేపీ పరిస్ధితి ఏమిటి అన్నది అర్ధం కావటంలేదు. తమతో అధికారికంగా పొత్తున్న జనసేన ఎంపీపీ పదవుల కోసం అవసరమైన మండలాల్లో టీడీపీతో కలిస్తే ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే. ఒకవైపు బీజేపీతో పొత్తుకోసం చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. కేంద్రప్రభుత్వానికి సహకారం అందించాలని చంద్రబాబు బహిరంగంగానే ప్రటకించిన విషయం అందరికీ తెలిసిందే. అయినా బీజేపీ నుండి ఎలాంటి స్పందన కనబడలేదు. మరి లోకల్ కమలనాదులు ఎలా స్పందిస్తారో చూడాలి.