Begin typing your search above and press return to search.
యోగీ... కష్టాలను కొని తెచ్చుకున్నారే!
By: Tupaki Desk | 21 Jun 2017 4:13 AM GMTనిజమే... ఎంత కీలక స్థానంలో ఉన్నా... తాము చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పకపోయినా, సదరు విషయంలోని వాస్తవాన్ని మరుగుపరచినా, లేదంటే సదరు విషయ సున్నితత్వాన్ని కనుగొనలేకపోయినా కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. మొన్నటికి మొన్న టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... అత్యాచారానికి గురైన ఓ బాలిక పేరును - ఆమె కుటుంబ సభ్యుల ఫొటోలను వెల్లడి చేశారు. సాధారణంగా అత్యాచార బాధితుల పేర్లు - ఫొటోలు - వివరాలు ఏవీ కూడా బయటకు వెల్లడి చేయడానికి వీల్లేదు. ఈ విషయం అంతగా పట్టించుకోని చంద్రబాబు బృందం ఆ బాలిక వివరాలను బహిర్గతం చేసేసింది. దీంతో చంద్రబాబు ఇబ్బందుల్లో పడ్డారు.
సరిగ్గా... చంద్రబాబు మాదిరే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్మనాథ్ కూడా ఇప్పుడు కష్టాలను కొని తెచ్చుకున్నారు. ఆ విషయం వివరాల్లోకి వెళితే... అసోంకు చెందిన గిరిజన మహిళ లక్ష్మీ ఒరాంగ్... యోగీతో పాటు అసోంకు చెందిన లోక్ సభ సభ్యుడు రాంప్రసాద్ సర్మాలపై కేసు నమోదు చేయాలంటూ ఏకంగా కోర్టుకెక్కింది. నవంబర్ 24 - 2007న ఆల్ ఆదివాసీ స్టూడెంట్స్ అసోషియేషన్ ఆఫ్ అస్సాం ఆందోళన సందర్భంగా కొందరు ఆమెను వివస్త్రగా చేసి దాడికి పాల్పడ్డారు. సదరు మహిళను వివస్త్రను చేసి కొడుతున్న ఫొటోలను అస్పష్టంగా మార్చకుండానే జూన్ 13న ఆదిత్యనాథ్ తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేశారు. ఎంపీ సర్మా కూడా ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న సదరు మహిళ... యోగీ - సర్మాల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిస్వనాథ్ లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వారిద్దరిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ తరఫున ఆందోళనలో పాల్గొన్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెపై దాడి చేశారని యోగీ - సర్మాలు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే ఈ విషయం కూడా తప్పేనని తాను ఏ పార్టీ తరఫున ఆందోళనలో పాల్గొనలేదని తెలిపారు. సదరు మహిళ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు. మరి యోగీపై కేసు నమోదవుతుందో, లేదో... రేపు సాయంత్రానికి గానీ తెలియదు. ఒకవేళ కేసు నమోదు కాకున్నా... సోషల్ మీడియాలో మహిళను కించపరిచేలా ఉండే ఫొటోను పోస్ట్ చేయడంతో పాటు... ఆ ఫొటో నేపథ్యాన్ని మార్చి కామెంట్ చేసిన యోగీపై మాత్రం విమర్శలు వెల్లువెత్తే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/