Begin typing your search above and press return to search.

క్రూరంగా చంపేశారు!

By:  Tupaki Desk   |   24 Feb 2018 12:29 AM GMT
క్రూరంగా చంపేశారు!
X
సెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరింది . సోషల్ మీడియాలో లైకుల కోసం యువత ఎంతటి నికృష్టానికైనా తెగిస్తున్నారు. ఆ తెగులు ఎంత‌లా ప‌ట్టిందంటే మ‌నిషి చ‌చ్చిపోతున్నా ప‌ట్టించుకోని దౌర్భాగ్యపు స‌మాజం పిచ్చిసెక‌లు, వెకిలి వేషాల‌తో.. బ్ర‌తికున్న మ‌నిషి సైతం ఇలా చెద‌లు ప‌ట్టిన సెల్ఫీమ‌నుషుల మ‌ధ్య‌లో బ్ర‌త‌క‌డం వ్య‌ర్ధం. జీవిస్తే అనార్ధం అనేంతలా. కానీ ఏం చేస్తాం దేవుడు పుట్టించిన బ్ర‌తుకుకు అర్ధం - ఓ ప‌ర‌మార్ధం లేక‌పోతే ఎలా..?

కలుషితమవుతున్న సమాజం
ఎక్కడ చూసినా అమానుషం
మంటగలుస్తున్న మానవత్వం

కేరళ‌లోని పాల‌క్క‌డ్ జిల్లా అత్త‌పాడి అనే గ్రామంలో మ‌తిస్థిమితంలేని ఓ యువ‌కుడు మ‌ధు(30) అక్క‌డే దొరికింది తింటూ జీవ‌నం కొనసాగించేవాడు. అయితే ఓ రోజు దుకాణాల్లో తినుబండ‌రాల్ని దొంగిలించుతున్నాడ‌నే నెపంతో ఆ ఊరిగ్రామ‌స్తులు చెట్టుకు క‌ట్టేసి చిత్ర హింస‌లు పెట్టారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు కొట్టారు. ఓ ప‌క్క తీవ్రంగా గాయాలై..దెబ్బ‌ల‌తో అల్లాడిపోతుంటే సాటి మ‌నిషిగా ఆదుకోవాల్సింది పోయి సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డారు. త‌మ పైశాచిక ఆనందాన్ని పొందారు.

అయితే మధ్యాహ్నం వేళ క‌ట్టేసి ఉన్న ఆ యువ‌కుడికిపై జాలి చూపిన ఓ వ్యక్తి పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఫిర్యాదుతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు బాధితుణ్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మార్గం మ‌ధ్య‌లో ఆ బాధితుడు మ‌ర‌ణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప‌లుకోణాల్లో ద‌ర్యాప్తు ప్రారంభించారు. దెబ్బ‌ల వ‌ల్ల మృతి చెందాడా..? లేక అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల మ‌రణించాడా అని విచారిస్తున్నారు. అయితే అగాలీ డీఎస్పీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం గ‌తంలో మ‌ధు పై మూడు కేసులు న‌మోదు అయ్యాయ‌ని అన్నారు. మ‌ధు అమాయకుడే కానీ , దుఖాణాల్లో చిల్ల‌రదొంగ‌త‌నాలు పాల్ప‌డుతుంటే కేసు న‌మోదు చేశామ‌ని , అత‌ని కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని చెప్పుకొచ్చారు.

ఈ నేప‌థ్యంలో అత్తాప‌డి గ్రామానికి చెందిన ఊరు గ్రామ‌స్తులు సీసీ పుటేజీల ఆధారంగా మ‌ధు దుఖాణాల్లో దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డాడంటూ చెట్టు క‌ట్టేసి చిత్రంహింస‌ల‌కు పాల్ప‌డ్డార‌ని అన్నారు. ఆ స‌మ‌యంలో బాధితుణ్నివీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో తాము రంగంలోకి దిగిన‌ట్లు సూచించారు. అయితే అప్ప‌టికే గ్రామ‌స్తుల దెబ్బ‌ల‌కు తాళ‌లేక కుప్ప‌కూలి పోయిన మ‌ధుని కొట్టతారాలోని ప్రభుత్వ గిరిజన స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకువెళుతుండగా పోలీసుల జీపులో చనిపోయిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు మ‌ధుని చిత్ర హింస‌ల‌కు పాల్ప‌డుతుంటే సెల్ఫీ లు దిగిన ఆ యువ‌కుల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తుంటే పైసాచిక ఆనందం పొంద‌డం క‌రెక్ట్ కాద‌ని అన్నారు. మ‌రికొంద‌రు సెల్ఫీ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన‌ట్లు అగాలీ డీఎస్పీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ తెలిపారు.