Begin typing your search above and press return to search.

రెండో పెళ్లాం ఉండగానే మూడో పెళ్లికి ట్రై చేశాడు.. ఆమేం చేసిందంటే?

By:  Tupaki Desk   |   4 May 2022 7:33 AM GMT
రెండో పెళ్లాం ఉండగానే మూడో పెళ్లికి ట్రై చేశాడు.. ఆమేం చేసిందంటే?
X
కీలక వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్టు. రెండో పెళ్లాం ఉండగానే.. మూడో పెళ్లికి ప్రయత్నించి.. ఆ విషయం రెండో భార్యకు తెలిసినంతనే ఆమె ఆత్మహత్య చేసుకున్న ఉదంతానికి సంబంధించి కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది.

ఈ సందర్భంగా తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరగా.. కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి మరణానికి కారణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్ని విడిచిపెట్టటం కుదరదని స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే..

వారణాసికి చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. ఆమెతో జరిగిన వివాహం గురించి దాచి పెట్టి రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగని అతడు.. రెండో భార్యకు తెలీకుండా మూడో పెళ్లి ప్రయత్నాల్ని మొదలు పెట్టారు.

ఈ విషయం తెలిసిన రెండో భార్య తీవ్ర ఆవేదనకు గురైంది. పది.. పన్నెండేళ్లుగా తనను భర్త.. అత్తమామలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాతి రోజే ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ఈ కేసుకు సంబంధించి తనను తప్పించాలని కోరుతూ డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సెషన్స్ న్యాయమూర్తి రిజెక్టు చేయగా.. హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. నిందితుడి అభ్యర్థనను తోసిపుచ్చారు.

తన భర్త మరొక మహిళతో ఉండటాన్ని.. వివాహం చేసుకోవటాన్ని ఏ మహిళా భరించలేదన్నారు. సుశీల్ కుమార్ రెండో భార్య ఆత్మహత్య చేసుకోవటానికి మూడో పెళ్లి సరైన కారణం కాకపోవచ్చని.. కానీ భర్తతో సహా అత్తింటి వారు తనను దశాబ్దానికి పైనే వేధించారని చనిపోవటానికి ముందు పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. అలాంటి నేరారోపణలు ఉన్నప్పుడు విచారించాల్సిన అవసరం ఉందంటూ.. అతడి పిటిషన్ ను కొట్టేసింది.