Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు తృణ‌మూల్‌, బీజేడీ షాక్!

By:  Tupaki Desk   |   3 Jan 2019 11:09 AM GMT
కేసీఆర్ కు తృణ‌మూల్‌, బీజేడీ షాక్!
X
ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లే క‌నిపిస్తోంది. కేంద్ర‌ప్ర‌భుత్వం - బీజేపీకి వ్య‌తిరేకంగా ఈ రెండు పార్టీలో తొలిసారిగా లోక్‌స‌భ‌లో గురువారం నిర‌స‌న వ్య‌క్తం చేశాయి. ఈ నిర‌స‌న ప్ర‌క్రియ‌లో ఇరు పార్టీలు కాంగ్రెస్ తో జ‌త క‌ల‌వ‌డం ఆసక్తి క‌లిగించింది.

ర‌ఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి మ‌న‌దేశంలో కొన్ని నెల‌లుగా ర‌చ్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఒప్పందానికి సంబంధించిన ప‌త్రాలు గోవా ముఖ్య‌మంత్రి - మాజీ ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ బెడ్ రూంలో ఉన్నాయంటూ ఓ ఆడియో టేపు బ‌య‌ట‌కు రావ‌డం తాజాగా సంచ‌ల‌నం సృష్టించింది. గురువారం ఈ అంశంపై లోక్ స‌భ‌లో మ‌రోసారి ర‌చ్చ న‌డిచింది. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది.

ర‌ఫేల్ ఒప్పందం పై ర‌చ్చ న‌డుస్తుంగా.. ఆ ఒప్పందానికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీలు లోక్ స‌భ‌లో నిర‌స‌న చేప‌ట్టారు. ఒప్పందంపై ద‌ర్యాప్తు జ‌రిపేందుకు సంయుక్త పార్ల‌మెంట‌రీ సంఘాన్ని(జేపీసీ) ఏర్పాటుచేయాల‌ని డిమాండ్ చేశారు. వారికి తృణ‌మూల్ కాంగ్రెస్ - బిజూ జ‌న‌తాద‌ళ్ ఎంపీలు కూడా జ‌త క‌లిశారు. మోదీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ కు సంఘీభావం తెలియ‌జేశారు. జేపీసీ ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు.

బీజేపీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ - టీడీపీ మ‌హా కూట‌మిని ఏర్పాటుచేసేందుకు ప్ర‌స్తుతం ముమ్మ‌ర కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చంద్ర‌బాబు నాయుడు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మికి తృణ‌మూల్ - బీజేడీ మొగ్గు చూపుతున్న‌ట్లు లోక్ స‌భ‌లో ఆ రెండు పార్టీల ఎంపీల తాజా నిర‌స‌న‌తో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ కు గ‌ట్టి షాక్ గా తృణ‌మూల్ - బీజేడీ ఎంపీల చ‌ర్య‌ను చెబుతున్నాయి.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు ప్ర‌య‌త్నాల్లో భాగంగా ఇటీవ‌లే కేసీఆర్ ఒడిశా - ప‌శ్చిమ బెంగాల్ ల‌లో ప‌ర్య‌టించారు. ఒడిశా ముఖ్య‌మంత్రి - బీజేడీ అధినేత న‌వీన్ ప‌ట్నాక్‌, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి - తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు వారి మ‌ద్ద‌తు కోరారు. ఈ నేప‌థ్యంలో వారిరువురు కాంగ్రెస్ - టీడీపీ కూట‌మి వైపు మొగ్గు చూపుతుండ‌టంతో కేసీఆర్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాల‌కు గ‌ట్టి దెబ్బ త‌గిలిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.