Begin typing your search above and press return to search.
ట్రిపుల్ తలాక్... బ్లాక్ బస్టర్ హిట్
By: Tupaki Desk | 30 July 2019 1:55 PM GMTదేశవ్యాప్తంగా ఎన్నో సంచనాలకు కారణమైన ట్రిపుల్ తలాక్ బిల్లు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బీజేపీ గత నాలుగేళ్లుగా ఈ బిల్లును చట్టంగా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. తొలిసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పుడే ఈ బిల్లును చట్టంగా చేసేందుకు విఫల ప్రయత్నాలు చేసింది. ఇక ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభతో పాటు రాజ్యసభలో ఆమోదం పొందేలా చేయడంలో సక్సెస్ అయ్యింది. లోక్ సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలోనూ నెగ్గడంతో బీజేపీ సర్కార్ మరో ఘనతను తమ ఖాతాలో వేసుకుంది.
వాస్తవంగా ఈ బిల్లు విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన చర్చోపచర్చలు, వాదోపవాదాలు నడుస్తున్నాయి. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లును కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ జరగగా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ముస్లిం మహిళలకు తమ భర్తలు కేవలం మూడు తలాక్... తలాక్.. తలాక్ అని చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కీలకమైన ముస్లిం మహిళల వివాహానికి సంబంధించిన బిల్లు, ఇందులో అనేక మతపరమైన నియమాలు కూడా ఉండడంతో బిల్లు పాస్ విషయంపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు, ముఖ్యంగా మైనార్టీలు ఎంతో ఆసక్తితో ఉన్నారు.
ఇక ఈ రోజు రాజ్యసభలో జరిగిన చర్చ తర్వాత సభ్యులకు స్లిప్‌లు పంచారు. అనంతరం స్లిప్‌లు లెక్కించిన చైర్మన్ వెంకయ్యనాయుడు బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు. మొత్తం 5 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఇక ఇప్పుడు ఇది చట్టంగా మారడమే మిగిలి ఉంది. ఈ బిల్లు ఆమోదంపై మైనార్టీల్లోనే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆధునిక వాదులు, ముస్లిం మహిళల్లో చాలా మంది ఈ బిల్లు పాస్ అవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కరుడుగట్టిన మతచాందస వాదులు మాత్రం బిల్లు పాస్‌పై అసహనంతో ఉన్నారు.