Begin typing your search above and press return to search.

ట్రిఫుల్ త‌లాక్..ముస్లిం మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేక‌మా?

By:  Tupaki Desk   |   19 Sep 2018 10:41 AM GMT
ట్రిఫుల్ త‌లాక్..ముస్లిం మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేక‌మా?
X
మైనార్టీల‌తో పేరుతో అత్య‌ధిక రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందిన పార్టీగా పేరున్న మ‌జ్లిస్ ను ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ముస్లిం మ‌హిళ‌ల హ‌క్కుల గురించి ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రాజ‌కీయ పార్టీ మాట్లాడ‌లేని వేళ‌.. ట్రిఫుల్ త‌లాక్ పేరుతో మోడీ.. వారి దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు.

ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. ముస్లిం మ‌హిళ‌ల్లో అంద‌రూ కాకున్నా.. కొంద‌రు ట్రిఫుల్ త‌లాక్ కార‌ణంగా తీవ్ర‌మైన మ‌నోవ్య‌ధ‌కు గురి అవుతున్నారు. వారి గోడును వినే వ్య‌వ‌స్థ‌లు లేక‌పోవ‌టం ఒక దుర‌దృష్ట‌క‌ర‌మైన అంశంగా చెప్పాలి. ఇలాంటి వేళ‌.. ముస్లిం మ‌హ‌హిళ‌ల‌కు భ‌రోసానిస్తూ ట్రిఫుల్ త‌లాక్ మీద మోడీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తాము రూపొందించిన బిల్లును చ‌ట్టంగా మార్చేందుకు చట్ట‌స‌భ‌లో నెంబ‌ర్లుత‌మ‌కు అనుకూలంగా లేని నేప‌థ్యంలో కేబినెట్ సాయంతో త‌న‌కున్న విశేష అధికారాల్ని ప్ర‌యోగిస్తూ.. తాజాగా కేబినెట్ చేత ఓకే అనిపించి.. ఆ వెంట‌నే ఆర్డినెన్స్ జారీ చేయ‌టం ద్వారా మోడీ సంచ‌ల‌నం సృష్టించారు.

ఈ వ్య‌వ‌హారంపై మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తంచేశారు. ముస్లిం మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేక‌మైన ఆర్డినెన్స్ గా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఆర్డినెన్స్ తో ముస్లిం మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇస్లాంలో పెళ్లి అన్న‌ది సివిల్ కాంట్రాక్ట్ అని.. ఇందులో ప్యానెల్ ప్రొవిజ‌న్లు తీసుకురావ‌టం త‌ప్ప‌న్నారు. ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్య‌తిరేకంగా అభివ‌ర్ణించారు. మారే కాలానికి త‌గ్గ‌ట్లుగా.. మార‌కుండా ఉంటానంటున్న ఓవైసీ మాట‌ల‌కు ముస్లిం మ‌హిళ‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.