Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన త్రిష
By: Tupaki Desk | 26 Dec 2022 6:39 AM GMTఅప్పుడెప్పుడో 'వర్షం' సినిమాతో మెరిసిన త్రిష ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. అటు ప్రభాస్, ఇటు త్రిష ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా బ్యాచ్ లర్ లైఫ్ తోనే సినిమాలు చేస్తూ గడిపేస్తున్నారు. తమిళనాడులో జన్మించిన త్రిష తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీఇచ్చి అన్ని భాషల్లో నటించి పాపులర్ అయ్యింది.
మిస్ చెన్నైగా గెలిచాక సినీ ఇండస్ట్ీరలోకి అడుగుపెట్టింది. తమిళంలో 'జోడి' అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లోకి 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో ప్రవేశించింది. వర్షం , నువ్వొస్తానంటే నేనొద్దంటానా? , అతడు సినిమాలతో పాపులర్ అయ్యింది. తర్వాత స్టార్ హీరోయిన్ గా అగ్రహీరోలందరితో కలిసి చేసింది.
ప్రస్తుతం దర్శకుడు ఎం. శరవణన్ అన్యుమ్ ఆల్వేస్ దర్శత్వంలో 'రంగీ' అనే సినిమాలో నటిస్తోంది., ఆయన దర్శకత్వంలో త్రిష నటిస్తున్న తాజా చిత్రం 'రంగీ' విడుదలకు సిద్ధమైంది.. ఈ సినిమాలో పలు వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించింది.
ఆ తర్వాత అప్పీల్‌పై సెన్సార్ బోర్డ్ సినిమా నుంచి 30 సీన్లను తొలగిస్తూ 'యూఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం 'రంగీ' సినిమా ట్రైలర్ విడుదలై వైరల్‌గా మారింది. డిసెంబర్ 30న సినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంలో త్రిషతో సహా చిత్రబృందం 'రంగీ' ప్రమోషన్ పనుల కోసం ప్రెస్ మీట్ పెట్టింది. దీని గురించి త్రిష మాట్లాడుతూ “నేను తెరపైకి వచ్చి 20 సంవత్సరాలు అయ్యింది, నేను ఎప్పుడూ సానుకూల వ్యాఖ్యలను మాత్రమే తీసుకుంటాను. నేను ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోను.' అని వివరణ ఇచ్చింది.
ఇక తాను కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం మొదలైందని.. ఆ సమాచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదని, నాకు రాజకీయాలతో సంబంధం లేదని త్రిష తెలిపింది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, నీ అభిమాన నటుడు ఎవరు వంటి ప్రశ్నలకు దూరంగా ఉండడం మంచిదని విలేకరులకు బదులిచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.