Begin typing your search above and press return to search.

ఫేక్ ఐడీతో నితిన్ డైరెక్ట‌ర్ పై నెట్టింట ట్రోలింగ్‌..!

By:  Tupaki Desk   |   27 July 2022 6:30 AM GMT
ఫేక్ ఐడీతో నితిన్ డైరెక్ట‌ర్ పై నెట్టింట ట్రోలింగ్‌..!
X
సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగిపోయాక పాజిటివ్ న్యూస్ కంటే నెగెటివ్ వార్త‌ల‌కే ప్ర‌ధాన్య‌త పెరిగింది. క్ష‌ణాల్లో నెగిటివ్ వార్త‌లు వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌తీ ఒక్క‌రూ సోష‌ల్ మీడియాని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికే ఉప‌యోగిస్తూ సెల‌బ్రిటీల‌ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా నితిన్ డైరెక్ట‌ర్ ని ఓ ఫేక్ ఐడితో కొంత మంది అడ్డంగా బుక్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `మాచార్ల నియోజ‌క వ‌ర్గం`.

ఈ మూవీ ద్వారా ఎడిట‌ర్‌ ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీని శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ఎన్ . సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవ‌ల నితిన్ న‌టించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ కావ‌డంతో అంతా ఈ మూవీపైనే ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇంత వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌, ఫ‌స్ట్ రిపోర్ట్‌, ఫ‌స్ట్ ఎటాక్ సినిమాపై మంచి బ‌జ్ ని క్రియేట్ చేశాయి. తాజాగా విడుద‌ల చేసిన ధ‌మ్కీ ట్రైల‌ర్ కూడా మంచి రెస్పాన్స్ ని రాబ‌ట్టింది. ఇదిలా వుంటే సినిమా రిలీజ్ కు టీమ్ రెడీ అవుతున్న వేళ ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది.

ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడి పేరు నెట్టింట వైర‌ల్ అవుతోంది. 2019లో ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన సంద‌ర్భంలో ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరుతో చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. అయితే ఇవి త‌ను చేసినవి కాద‌ని, ఎవ‌రో త‌న పేరుని మార్ఫింగ్ చేసి ఇలా ట్వీట్ చేశార‌ని ద‌ర్శ‌కుడు వివ‌ర‌ణ ఇస్తున్నారు.

నెట్టింట ఎం.ఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ట్విట్ట‌ర్ స్కీర్ షాట్ పేరుతో ఓ ట్వీట్ వైర‌ల్ గా మారింది. దీనిపై ద‌ర్శ‌కుడు స్పందించాడు. ట్విట్ట‌ర్ లో వైర‌ల్ అవుతోంది ఫేక్ ఐడీ. ఎవ‌రో కావాల‌ని ఎడిట్ చేసి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ క్రింత వున్న స్క్రీన్ షాట్ లో వున్న పేరు డిఫ‌రెంట్‌, నా పేరుతో వున్న స్పెల్లింగ్ వేరు. ఫోటొ షాప్ చేసిన వాడెవ‌డో స‌రిగా చేయ‌లేదు. నేను స్వ‌త‌హాగా వైఎస్ ఆర్ అభిమానిని, నేను ఎన్నిక‌ల ఫ‌లితాల స‌మ‌యంలో నా అబిప్రాయాన్ని చెప్పా త‌ప్ప వేరే కులాన్ని కించ‌ప‌ర‌చ‌లేదు. ఆ స‌మ‌యంలో నేను చేసిన ట్వీట్ ని ఒక్క‌టి కూడా డిలీట్ చేయ‌లేదు` అని వివ‌ర‌ణ ఇచ్చారు.

దీనికి నితిన్ కూడా అండ‌గా నిలిచాడు. ఒక న‌కిలీ వ్య‌క్తి చేసిన ఫేక్ ట్వీట్ ని అన‌వ‌ర‌మైన ర‌చ్చ సృష్టించింది. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇది ఇత‌రుల మ‌నోభావాలు దెబ్బ‌తీసింది. చాలా విచార‌క‌రం. ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాన్ని నేను ఖండిస్తున్నాను` అంటూ ద‌ర్శ‌కుడికి నితిన్ అండ‌గా నిలిచారు. ఈ సంద‌ర్భంగా ఒరిజిన‌ల్ ట్వీట్ ని, ఫేక్ ట్వీట్ ల‌ని రీట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట వైర‌ల్ గా మారింది.