Begin typing your search above and press return to search.
వంశీ ట్రాప్ లో ఆ ఇద్దరు మంత్రులూ!
By: Tupaki Desk | 29 Oct 2019 10:02 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వల్లభనేని వంశీ మోహన్ ను తీసుకెళ్లిన ఇద్దరు మంత్రులు.. ఇద్దరు నానీలపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతూ ఉన్నాయి. వంశీని జగన్ వద్దకు తీసుకెళ్లింది కొడాలి నాని - పేర్ని నాని. వీళ్లిద్దరూ జాయింటుగా కృషి చేసి వంశీని జగన్ వద్దకు తీసుకెళ్లినట్టుగా ఉన్నారు.
ఇంతకీ దానికి కారణం ఏమిటంటే..వీరిద్దరికీ వంశీతో గతం నుంచి సాన్నిహిత్యం ఉంది.పార్టీలు వేర్వేరు అయినా..వీరు ముగ్గురూ స్నేహితులుగా ఉన్నారు. రాజకీయంగా దారులు వేరైనా వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది. దాంతోనే ఇప్పుడు వంశీని వీళ్లిద్దరూ జగన్ వద్దకు తీసుకెళ్లారని టాక్.
అయితే వీరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల నెటిజన్లు కూడా మండి పడుతూ ఉన్నారు. అసలు వంశీ అవసరం ఇప్పుడు వైసీపీకి ఏమిటి? అనేది ముఖ్యమైన ప్రశ్న! వంశీ ఇటీవలి ఎన్నికల్లో ఎన్ని ఓట్ల మెజారిటీతో నెగ్గాడు? అతడు ఏ పాటి ప్రజానాయకుడు? అని వైసీపీ వాళ్లే ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఇక గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఫిరాయింపులు జరిగాయి.అప్పటి తెలుగుదేశం నేతలు వైసీపీ ఎమ్మెల్యేలను ఇలాగే తీసుకెళ్లి చంద్రబాబుతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత కథ ఏమైందో అందరికీ తెలిసిందే. ఫిరాయింపుదారులను జనం క్షమించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ వాళ్లు ఎందుకు ఇలా ఎమ్మెల్యేల కోసం ఆరాటపడుతూ ఉన్నారు? అనేది శేష ప్రశ్న.
జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి వారి చేత ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించే చేర్చుకోవచ్చు గాక. అయితే ఇలాంటి చేరికలు వైసీపీ శ్రేణులకు కూడా పెద్దగా ఇష్టం లేవు.ఎన్నికల ముందు వచ్చిన వాళ్లే చాలనే భావన ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వారు చాలా మందే వచ్చి చేరతామంటారు.. వీరిని చేర్చుకుని బావుకునేది ఏమీ లేదనే అభిప్రాయం వైసీపీ అనుకూల సోషల్ మీడియా వర్గాల నుంచి వినిపిస్తోంది. అలాంటి వారు ఇప్పుడు ఇద్దరు మంత్రులపై ట్రోల్స్ కొనసాగిస్తూ ఉన్నారు.