Begin typing your search above and press return to search.
పవన్ కు మద్దతుగా ఆ చానెళ్లపై ట్రోలింగ్...వైరల్!
By: Tupaki Desk | 23 April 2018 11:23 AM GMTజనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ ను నటి శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ దూషణలను పదే పదే ప్రసారం చేసి తనను - తన తల్లిని పనిగట్టుకొని అవమానించిన కొన్ని మీడియా చానెళ్లపై పవన్ ట్వీట్ వార్ మొదలుపెట్టిన విషయం విదితమే.
టీవీ9 శ్రీనిరాజు - రవి ప్రకాశ్ లలో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై పవన్ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ ట్వీట్లు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీపై - లోకేష్ - చంద్రబాబు - అర్కే తదితరులపై పవన్ ఘాటైన విమర్శలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. టీవీ9 - ఏబీఎన్ - టీవీ5 చానెళ్లపై ...ఆర్కే - రవిప్రకాశ్ - చంద్రబాబుల - లోకేశ్ లపై రకరకాల సెటైరికల్ ఫొటోలతో నెటిజన్లు ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ చానెళ్లపై, వారిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న నెటిజన్ల ట్రోలింగ్ పోస్టులలో కొన్ని యథాతథంగా....
* పవన్ మళ్లీ సైకిలెక్కుతాడా వర్మ...? అన్న ప్రశ్నకు....ఆల్రెడీ ఎక్కి తుక్కు తుక్కు చేసేశాడు శర్మ
* నీలం రంగు టాయిలెట్ కోసం టీవీ9...ఎరుపు రంగు బాత్రూం కోసం....రెండూ పనిచేసేవి ఎల్లో కోసం
* ఆ మూడు చానెళ్లలో ప్రజలకు అవసరమైన అసలు వార్తలు ఖాళీ బీకరులా ఉంటాయి....ఏది రియల్ ఏది వైరల్ అంటూ....చంద్రబాబు భజన బీకరులో కొంత ఆక్రమిస్తుంది.....ఏ టాపిక్ పై అయినా అనర్గళంగా మాట్లాడగలిగిన కొంతమంది వ్యక్తులతో పెయిడ్ న్యూస్ మాత్రం బీకర్ నిండుగా ఉంటుంది.
* చూడప్పా ఎన్ సీ బీ ఎన్....అక్కడ మూవీస్...ఇక్కడ పాలిటిక్స్.....యాటిట్యూడ్ సేమ్ టు సేమ్.....
* నిన్న మొన్న నా గురించి డిబేట్లు పెట్టారు కదా....ఇపుడు నా ట్వీట్ల గురించి కూడా డిబేట్లు పెట్టండి....అన్న క్యాప్షన్ కు రవి ప్రకాశ్ తల పట్టుకుంటున్న ఫొటో ఒకటి.
* చంద్రబాబు బుర్రకథ చెబుతుండగా...ఆర్కే - రవిప్రకాశ్ లు తాన తందనా అంటున్నట్లు మరో పోస్ట్ వైరల్ అవుతోంది. నేను తప్ప ఈ రాష్ట్రంలో వేరే ప్రత్యామ్నాయం లేదని చంద్రబాబు అంటుంటే....100 శాతం నిజమంటూ రవి ప్రకాశ్....2019లో కూడా బాబే....అంటూ ఆర్కే తానతందనా...అన్నట్లు సెటైర్ వేశారు. మీకు మీరే సర్వేలు చేయించుకుంటారు....మీకు మీరే తాన తందనా అంటారు...ఇలా బుర్ర తినే కథలు ఎన్ని రోజులు చెబుతారు....అంటూ అదే పోస్టులో మరో సెటైర్ వేశారు.
* నువ్వు ఎప్పుడైతే బ్రోకర్ పచ్చమీడియాను రాష్ట్రం నుంచి తరిమి కొడతావో అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది.
* ఈ రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది....# పవన్ కల్యాణ్ గారు వెంటనే స్పందించాలి.
* ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగారుస్తూ...చంద్రబాబు అవినీతి పాలనను వెనకేసుకొస్తున్న ఎల్లో మీడియాను బహిష్కరిద్దాం...అంటూ కొంతమంది బ్యానర్ పై రాసి ర్యాలీ చేస్తున్న ఫొటో ఒకటి వైరల్ అయింది.
* నిజాలను వినిపించం-టీవీ9(కరెన్సీ నోట్లతో చెవులు మూసుకున్న కోతి)....నిజాలను చూపించం-ఏబీఎన్(కరెన్సీ నోట్లతో కళ్లు మూసుకున్న కోతి)....నిజాలను మాట్లాడం-టీవీ5(కరెన్సీ నోట్లతో నోరు మూసుకున్న కోతి)....గాంధీ గారి మూడు కోతుల సింబాలిక్ ఫొటో.
* రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియా పరిస్థితి ఇలా ఉందంటూ....గుడ్డెద్దు చేలో పడ్డట్లు.....వార్తలు రాస్తోన్న ఎద్దు ఫొటో.
* తనను చూసి ఎవరికైనా అలా చేయాలనిపిస్తుందని అడిగిన ఓ అమ్మాయితో నిత్యం డిబేట్లు(శ్రీరెడ్డి).....రోజుకో అమ్మాయితో తిరుగుతాను అని బాహాటంగా స్త్రీలను కించపరిచే మరో వ్యక్తి(వర్మ) ట్వీట్లు హెడ్ లైన్స్ గా వేస్తోన్న మీడియా చానెళ్లు జర్నలిజానికే సిగ్గుచేటు.
* ఏబీఎన్ - టీవీ9 - టీవీ5లను జనసేన జెండా కప్పుకున్న పులి వేటాడుతోన్న ఫొటో.