Begin typing your search above and press return to search.

పులివెందుల బ‌స్టాండ్ క‌ట్ట‌లేని జ‌గ‌న్‌.. నెటిజ‌న్ల ట్రోలింగ్స్‌!!

By:  Tupaki Desk   |   5 April 2022 10:30 AM GMT
పులివెందుల బ‌స్టాండ్ క‌ట్ట‌లేని జ‌గ‌న్‌.. నెటిజ‌న్ల ట్రోలింగ్స్‌!!
X
రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు నిర్మిస్తానంటూ.. ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్న సీఎం జ‌గ‌న్‌కు.. ఆయ‌న సొంత జిల్లా, సొంత నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం చిన్న‌పాటి బ‌స్టాండ్‌ను కూడా నిర్మించ‌లేక పోతున్నారే! అంటూ.. నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు... బ‌స్టాండే క‌ట్ట‌లేని జ‌గ‌న్‌.. మూడు రాజ‌ధానులు ఎలా క‌డ‌తారో.. అంటూ.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.. విష‌యంలోకి వెళ్తే.. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం.. దాదాపు 45 ఏళ్లుగా.. వైఎస్ కుటుంబం పాల‌న‌లోనే ఉంది. ప్ర‌బుత్వాలు మారినా.. ఇక్క‌డ వీరిదే గెలుపు. గ‌తంలో రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. త‌ర్వాత‌.. విజ‌య‌మ్మ‌.. ఇప్పుడు జ‌గ‌న్‌.

వీరే ఇక్క‌డ నుంచి గెలుస్తున్నారు. ప‌ద‌వులు కూడా చేప‌డుతున్నారు.. కానీ, ఇక్క‌డి పులివెందుల ప్ర‌జ‌ల కు మాత్రం క‌నీస మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌లేక పోతున్నార‌నే వాద‌న మాత్రం వినిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా.. పులివెందుల‌లో ప్ర‌జ‌లు వినియోగించుకునే బ‌స్టాండ్‌ను కూడా నిర్మించ‌లేక పోతున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. ఇక్క‌డ బస్టాండ్‌ కోసం రెండు తడికలతో ఏర్పాటు చేసిన‌ చిన్న పాకను చూపిస్తూ.. 'ఇదే పులివెందుల బ‌స్టాండ్‌' అని ఐ-టీడీపీ విభాగం తెగ‌ ప్రచారం చేస్తోంది.

విషయంలోకి వెళ్తే.. ఇది వాస్త‌వ‌మే. ఇక్క‌డ బ‌స్టాండ్ నిర్మించాల్సి ఉంది. కానీ, నిర్మించ‌లేదు. ఇక్క‌డ బస్టాండ్ నిర్మాణం కోసం 40 ఏళ్ల క్రితం ఓ దాత ప్రభుత్వానికి స్థలాన్ని ఇచ్చారు. అంటే.. ఈ స్థ‌లం ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే ఉంది. అక్కడ భారీ మల్టిప్లెక్స్ నిర్మించాల‌ని..దీనిలోనే బ‌స్టాండ్ ఏర్పాటు చేయాల‌ని పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. కానీ, వైఎస్ హ‌యాంలో ఏమీ కాలేదు. దీంతో జ‌గ‌న్‌ సీఎం అయిన తర్వాత ఆయ‌నే స్వ‌యంగా దీనికి శంకుస్థాపన చేశారు. కానీ, రెండున్న‌రేళ్లు పాల‌న పూర్త‌యినా.. బస్టాండ్ కోసం నిధులు కేటాయించ‌లేదు.

అంతేకాదు.. పునాదుల వ‌ర‌కు ప‌నిచేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు కూడా చెల్లించ‌లేదు. దీంతో స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ బిల్లులు రాలేద‌ని చెబుతూ... ప‌నిని ఆపేశారు. దీంతో బ‌స్టాండ్ నిర్మాణం.. పునాదుల వ‌ద్దే ఆగిపోయింది. అయితే.. ప్ర‌యాణికుల కోసం.. జాగా లేకపోవ‌డంతో ఇక్క‌డే ప్రస్తుతానికి తడికల పందిరి వేసి అదే బస్టాండ్ అని పిలుస్తున్నారు. ప్ర‌యాణికులు ఎండ‌కు ఎండుతూ.. వాన‌కు త‌డుస్తూ.. అక్క‌డే వేచి ఉండి..బ‌స్సులు ఎక్కుతున్నారు. ఇదే విష‌యాన్ని.. ఐ-టీడీపీ వెలుగులోకి తెచ్చింది.

మూడేళ్లలో కనీసం ఓ బస్టాండ్ కూడా కట్టలేకపోయిన.. అదీ సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయిన జగన్ ఇక మూడు రాజధానులు కడతారా అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో సమాధానం చెప్పుకోవడం వైసీపీ సోషల్ మీడియాకు కూడా కష్టంగా మారింది. పోనీ.. ఆ పార్టీ నేతలైనా స్పందిస్తారా? అంటే. అది కూడా లేదు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. కీల‌క నేత‌లు అంద‌రూ నిత్యం బ‌స్టాండ్ మీదుగానే రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోలేదు.

ప్ర‌స్తుతం ఈ విష‌యంలో మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది. ఎందుకంటే జగన్ సీఎం అయిన తర్వాత బస్టాండ్ అద్భుతంగా నిర్మిస్తామని ఓ గ్రాఫిక్స్ రిలీజ్ చేశారు. మూడేళ్లు అయినా.. దీనిపై క్లారిటీ లేదు. ఆ గ్రాఫిక్స్ చూపించి.. జగన్అలా చేస్తానన్నారు.. కానీ ఇలా చేశారంటూ ఐటీడీపీ విభాగం.. తడికల పందిరి చూపిస్తూ.. ఎద్దేవా చేస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా.. నాయ‌కులు స్పందిస్తారో లేదో చూడాలి.