Begin typing your search above and press return to search.

జో బైడెన్‌ పై ట్రోల్స్.. మతి గతి తప్పిందా?

By:  Tupaki Desk   |   16 April 2022 4:28 AM GMT
జో బైడెన్‌ పై ట్రోల్స్.. మతి గతి తప్పిందా?
X
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వయసు అయిపోవడంతో ఆయన వృద్ధాప్యానికి చేరువ అవుతున్నారు. అసలు ఏమీ గుర్తుండడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఆయన ప్రవర్తన చూశాక అందరూ అదే అంటున్నారు. వయసు మీదపడ్డ వారు చేసే పనులను ఆయన చేస్తున్నారు.

తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విచిత్రంగా ప్రవర్తించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రీన్స్ బోరోలోని నార్త్ కరోలినా అగ్రికల్చర్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పోడియం వద్ద జో బైడెన్‌ ప్రసంగించారు.

అయితే ప్రసంగం అనంతరం పక్కకు తిరిగి ఎవరికో కరచలనం ఇస్తున్నట్టు చేయి చాచారు. కానీ అక్కడ ఎవరూ లేకపోవడం గమనార్హం. తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం జో బైడెన్‌ ఆపై షేక్ హ్యాండ్ పోజిషన్ లో తన చేతిని చాచి కుడివైపునకు తిరిగారు. అయితే వేదికపై ఆయన సంజ్ఞకు స్పందించేందుకు ఎవరూ లేరు. దీంతో కొన్ని క్షణాల పాటు ఇబ్బందిగా కదిలిన జోబిడెన్.. వెంటనే అక్కడున్న జనాల వైపు మళ్లారు.

సుమారు 40 నిమిషాల పాటు సుధీర్ఘ ప్రసంగం చేసిన జో బైడెన్‌ .. తాను పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఒకప్పుడు ప్రొఫెసర్ గా పనిచేశానని చెప్పుకొచ్చారు. నిజానికి అక్కడి విద్యార్థులకు ఆయన ఒక్కసారి కూడా బోధించలేదట.. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఇక ప్రత్యర్థి రిపబ్లిక్ పార్టీ నేతలు, జో బైడెన్‌ ప్రవర్తనా తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వైట్ హౌస్, బైడెన్ కుటుంబ సభ్యులు ఎక్కడ? ఆయనను అందంగా కనిపించేలా చేయడమే వారి పనా? అని రిపబ్లిక్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక డిమెన్షియా బాధితుడిలా జో బైడెన్‌ కనిపిస్తున్నాడని వారు కోరుకుంటే తప్ప.. ఇది నిజంగా వింతగా ఉంది అని అంటున్నారు.