Begin typing your search above and press return to search.

కశ్మీరి విలీనం.. ఈ చెత్త కామెంట్లకు ఎందుకు భక్తులూ?

By:  Tupaki Desk   |   7 Aug 2019 11:56 AM GMT
కశ్మీరి విలీనం.. ఈ చెత్త కామెంట్లకు ఎందుకు భక్తులూ?
X
కశ్మీర్ కు స్వయంప్రతిపత్తి రద్దుపై కొందరు అతిగా రియాక్ట్ అయిపోతూ ఉన్నారు. కశ్మీర్లో తమకు స్వతంత్రం వచ్చిందని వారు ఫీలయిపోతున్నారు. ఏనాడూ ఇలాంటి వాళ్లు కశ్మీరీ ఛాయలకు కూడా వెళ్లి ఉండరు. అయితే వీళ్లు అతిగా రియాక్ట్ అయిపోతూ ఉన్నారు.

ఆ సంగతలా ఉంటే.. మరి కొందరు హద్దు మీరి కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకునే అవకాశం ఉండేది కాదని, అలా చేస్తే ఆ అమ్మాయికి కశ్మీరీ రాష్ట్ర పౌరసత్వం పోయేదని.. ఇప్పుడు మాత్రం ఎంచక్కా కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

వీటిల్లో అసభ్యత దొర్లుతూ ఉంది. ఫేస్ బుక్ లోని సగటు బీజేపీ వీరాభిమానులు మొదలుకుని యూపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఈ తరహా కామెంట్ చేసినట్టుగా ఉన్నాడు.

ఇది నైచ్యం అని చెప్పాలి. ఏదో సాధించేసినట్టుగా అమ్మాయిల మీద ఇలాంటి కామెంట్లు ఎందుకో వాళ్లకే తెలియాలి. అయినా కశ్మీరీ అమ్మాయిని వీళ్లు పెళ్లి చేసుకోవడం కాదు, ఆ అమ్మాయిలూ వీళ్లను పెళ్లి చేసుకోవాలనే ప్రాథమిక విషయం తెలుసా?

అమ్మాయిల గురించి అనుచిత కామెంట్లు చేసే వీళ్లకూ అక్కో, చెల్లో ఉంటారు కదా, కశ్మీర్లో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఎర్రగాబుర్రగా ఉంటారు కదా.. వారికీ వీరికీ ముడిపెట్టి మాట్లాడితే ఎలా ఉంటుంది? కొంచెమైనా ఇంగితం ఉండి మాట్లాడితే మంచిదేమో!