Begin typing your search above and press return to search.
బీఎస్పీ మరీ ఇంత ముదురుపార్టీనా?
By: Tupaki Desk | 27 Dec 2016 5:11 AM GMTపెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీ పుణ్యమా అని.. పెద్ద పెద్ద చేపల గుట్టుమట్లు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయ్. ఇంతకాలం గుట్టుగా సాగిన వ్యవహారాలకు చెక్ పడేలా వ్యవస్థ సిద్ధం కావటంతో తెరచాటు భాగోతాలన్నీబయటకు వచ్చేస్తున్నాయ్. పెద్దనోట్లను రద్దు చేయటం.. వాటిని వివిధ రూపాల్లో వినియోగం తెచ్చేందుకు పడిన కక్కుర్తితో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి బయటకు వచ్చింది.
రేపోమాపో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందన్న అంచనాల వెలువడుతున్న వేళ.. యూపీ ఎన్నికల్లో కీలకభూమిక పోషించే అవకాశం ఉందని భావిస్తున్న బీఎస్పీ(బహుజన్ సమాజ్ వాదీ పార్టీ)కి సంబంధించిన సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆ పార్టీ అధినేత్రి మాయావతికి దిమ్మ తిరిగిపోయేలాంటి విషయాన్ని ఈడీ గుర్తించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆ పార్టీ బ్యాంకు ఖాతాలోకి రూ.104కోట్ల నగదు జమ అయినట్లుగా ఈడీ వర్గాలు గుర్తించాయి.
అంతేకాదు.. మాయావతి సోదరుడు ఆనంద్ ఖాతాలో రూ.1.43 కోట్లు వేసినట్లుగా తేలింది. భారీ మొత్తాల్ని బ్యాంకుఖాతాల్లో వేసిన లావాదేవీల్ని యథాలాపంగా పరిశీలిస్తున్న వేళ.. ఈ వ్యవహారం బయటకు వచ్చింది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కరోల్ బాగ్ బ్రాంచ్ లో రెండు ఆసక్తికర అంశాల్ని అధికారులు గుర్తించారు. బీఎస్పీ ఖాతాలో రూ.102కోట్లు జమ కావటం.. అవన్నీ రద్దు అయిన పాత వెయ్యి నోట్లు కావటం గమనార్హం. రోజు తర్వాత రోజు చొప్పున భారీ మొత్తాన్ని జమ చేసిన విషయాన్ని గుర్తించారు. రోజు తర్వాత రోజు రూ.15 నుంచి రూ.17 కోట్ల చొప్పున నగదును జమ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో బ్రాంచ్ సీసీ కెమేరాల పుటేజ్ తో పాటు.. నగదు జమ చేసిన వారికి సంబంధించిన కేవైసీ పత్రాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. ఎన్నికల వేళ.. ఇలాంటి ఉదంతం బయటకు రావటం మాయావతికి ఇబ్బందేనన్న భావన వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/