Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ లో భారత విద్యార్థులకు నరకం.. విద్యార్థినులను ఎత్తుకెళుతున్న రష్యా సైనికులు
By: Tupaki Desk | 1 March 2022 9:30 AM GMTఉక్రెయిన్ సరిహద్దుల్లో భారతీయ విద్యార్థులు నరకం చూస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై కూర్చున్న భారతీయ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా వారిని కొడుతూ , కాలితో తన్నుతూ ,జుట్టు పట్టి ఈడ్చుకుంటూ నెట్టివేస్తున్న అక్కడి సనికులు గుంపుపైకి వాహనాలు కూడా ఎక్కిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. విద్యార్థులపైకి కాల్పులు జరుపుతూ గాయపరుస్తున్నాయి బలగాలు.
ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశానికి చేరుకునేందుకు పొరుగు దేశాల సరిహద్దులకు చేరుకున్న భారతీయ విద్యార్థులకు ఎదురవుతున్న దారుణమైన పరిస్థితులివీ..
ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా గగనతలాన్ని మూసివేసింది. దీంతో అక్కడ చిక్కుకున్న విద్యార్థులను పశ్చిమ సరిహద్దుల్లోని దేశాల నుంచి స్వదేశాలకు తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది.
రొమేనియా, హంగరీ, పొలండ్, స్లోవేకియాల నుంచి భారత విమానాలు వారిని తరలిస్తున్నాయి. ఆయా దేశాల సరిహద్దుల వద్దకు వారు చేరుకోవడమే అత్యంత క్లిష్టంగా మారింది. కష్టపడి అక్కడికి చేరుకున్నా బలగాలు తీవ్ర వేదింపులకు గురిచేస్తున్నట్టు బాధితులు వీడియోలు తీసి స్వదేశంలోని తమ కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారు.
ఉక్రెయిన్-పోలండ్ సరిహద్దుల్లో రోడ్డుపై కూర్చున్న విద్యార్థులను కాలితో తన్నుతున్న దృశ్యాలు.. విద్యార్థులపైకి కారును నడుపుకుంటూ రావడం.. విద్యార్థుల లగేజీని విసిరికొడుతున్న దృశ్యాలు ఇప్పుడు సరిహద్దుల్లో కనిపిస్తున్నాయి. సరిహద్దుల్లో వేచి ఉన్న భారతీయ విద్యార్థులపైకి స్లోవేకియా పోలీసులు కారం చల్లారు. పెప్పర్ స్ప్రే కొట్టారు. స్లోవేకియా ఎంబసీ పనిచేయడం లేదని వాపోయారు.
ఉక్రెయిన్ నుంచి సరిహద్దులకు చేరుకున్న భారతీయ విద్యార్థినులను రష్యా సైనికులు తమ స్నేహితులపై కాల్పులు జరిపారని..కొందరు అమ్మాయిలను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఓ యువతి ఏడుస్తూ వివరించింది. మోడీ, యోగి సాయం చేయాలని.. భారత సైన్యాన్ని ఇక్కడికి పంపించి మమ్మల్ని కాపాడండి అంటూ వేడుకుంది. ఈ వీడియోను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ షేర్ చేశారు.
ఈ క్రమంలలోనే కేంద్రం అప్రమత్తమైంది. నలుగురు కేంద్రమంత్రులను ఉక్రెయిన్ పక్కనున్న నాలుగు దేశాలకు పంపింది.