Begin typing your search above and press return to search.

అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల దాడి: ఎంపీ ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   18 Nov 2022 8:33 AM GMT
అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల దాడి: ఎంపీ ఏమ‌న్నారంటే
X
తెలంగాణ‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు మునుగోడుఉప ఎన్నిక‌, ద‌రిమిలా ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేలను కొను గోలు చేసే ప్ర‌య‌త్నం వంటివి రాజ‌కీయంగా దుమ్ము రేపాయి. అటు టీఆర్ఎస్‌, ఇటు బీజేపీల మ‌ధ్య భోగి మంట‌లు చెలరేగాయి.

ఇవి కొన‌సాగుతుండ‌గానే ఇంత‌లోనే ఇప్పుడు ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత మంట పెట్టాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె క‌విత కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్య‌ల‌తో మ‌రో రాజ‌కీయ ర‌ణ‌రంగం తెర‌మీదికి వ‌చ్చింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ ఎస్‌ పార్టీ కార్యకర్తలు ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేశారు. ఇంట్లోని అద్దాలు ధ్వంసం చేశారు. పూల కుండీల‌ను ధ్వ‌సం చేశారు. ఫ‌ర్నిచ‌ర్‌ను ముక్క‌లు చేశారు. ఈ దాడిపై ఎంపీ అర్వింద్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

''కేసీఆర్, కేటీఆర్, కవితల ఆదేశాలపై హైదరాబాద్‌లోని నా ఇంటిపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ... బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు'' అంటూ ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.

మరోవైపు... ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫోన్ చేశారు. అరవింద్ నివాసంపై దాడి ఘటన వివరాలను సంజయ్ అడిగి తెలుసుకున్నారు.

ఇదిలావుంటే, ఎమ్మెల్సీ క‌విత మ‌రింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నిజామాబాద్ చౌర‌స్తాలో ఎంపీ అర్వింద్‌ను చెప్పుతో కొడ‌తానంటూ కామెంట్లు చేశారు. అంతేకాదు, త‌ప్పుడు కామెంట్లు చేస్తే త‌రిమిత‌రిమి కొడ‌తాం బిడ్డ‌! అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈ ప‌రిణామాలు మునుగోడును మించిపోయేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.