Begin typing your search above and press return to search.

మునుగోడులో టామ్ అండ్ జెర్రీ ఫైట్: నాలుగు రౌండ్ లో 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్.. బీజేపీ టఫ్ ఫైట్

By:  Tupaki Desk   |   6 Nov 2022 5:56 AM GMT
మునుగోడులో టామ్ అండ్ జెర్రీ ఫైట్: నాలుగు రౌండ్ లో 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్.. బీజేపీ టఫ్ ఫైట్
X
మునుగోడులో గెలుపు అంత ఈజీ కాదని అర్థమవుతోంది. టీఆర్ఎస్ కు బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తోంది. మునుగోడులో రౌండ్ రౌండ్ కు ఆధిక్యం దోబూచులాడుతోంది. పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి రాగా.. రెండు, మూడు రౌండ్లలో బీజేపీ లీడ్ లోకి వచ్చింది. నాలుగో రౌండ్లో మళ్లీ టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో విజయం కేవలం వందల ఓట్లతోనే తేలుతుందని అర్థమవుతోంది. చూస్తుంటే మునుగోడులో టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా నడుస్తోంది.

నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నానికి తుది ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలోకి దిగారు.

ఇక తొలి రౌండ్ గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. స్టల్ బ్యాలెట్ లో టీఆరెఎస్ ముందంజ వేసింది. 686 పోస్టల్ బ్యాలెట్.. 6సర్వీసు ఓటర్లు.. మొత్తం 692 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 4 ఓట్ల ఆధిక్యం లభించింది. వీటితో టీఆర్ఎస్ కు 228 ఓట్లు రాగా.. బీజేపీకి 224, బీఎస్పీ అభ్యర్థికి 10 ఓట్లు వచ్చాయి.

ఇక తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 2వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించిడం విశేషం. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 6069 ఓట్లు రాగా.. బీజేపీకి 4904 ఓట్లు, కాంగ్రెస్ కు 1887 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ లోనే టీఆర్ఎస్ ఏకంగా 1192 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా గులాబీ దండు మునుగోడులో పోటీనిస్తోంది. అయితే బీజేపీ కూడా బాగానే ఫైట్ ఇస్తోంది.

రెండో రౌండ్ లో రాజగోపాల్ రెడ్డి ఏకంగా 789 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. రెండో స్థానంలో టీఆర్ఎస్ ప్రభాకర్ రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ స్రవంతి ఉన్నారు.

ఇక మూడో రౌండర్ లో టీఆర్ఎస్ కు 7010 ఓట్లు రాగా.. బీజేపీకి 7426 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ లో టీఆర్ఎస్ పై 416 పరుగుల ఆధిక్యాన్ని బీజేపీ సాధించడం విశేషం.

-నాగులో రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకూ టీఆర్ఎస్ అభ్యర్థికి 26433 ఓట్లురాగా.. బీజేపీకి 25729 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 7380 ఓట్లు పోలయ్యాయి.

ఓవరాల్ గా టీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ తేలిపోయింది.