Begin typing your search above and press return to search.

మునుగోడు: బీజేపీకి భంగపాటే.. టీఆర్ఎస్ గెలిచినట్టే?

By:  Tupaki Desk   |   6 Nov 2022 10:36 AM GMT
మునుగోడు: బీజేపీకి భంగపాటే.. టీఆర్ఎస్ గెలిచినట్టే?
X
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో చివరకు బీజేపీ భంగపడేలా ఉంది. టీఆర్ఎస్ గెలుపు వాకిట ఉంది. తొలి రౌండ్లలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఫైట్ సాగింది. పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సంపాదించగా.. రెండు, మూడు రౌండ్లలో బీజేపీ అధిగమించింది. ఇక ఆ తర్వాత నుంచి హోరాహోరీగా సాగుతున్న రౌండ్లలో టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యత సాధించింది.

అయితే ముందుకు సాగుతున్న కొద్దీ టీఆర్ఎస్ కు ఆధిక్యత పెరుగుతోంది. స్పష్టమైన ఆధిక్యం వస్తుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచుకుంటున్నారు.

ప్రస్తుతం 11 రౌండ్లు ముగిసేసరికి అధికార టీఆర్ఎస్ ఏకంగా 5వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 11వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7235, బీజేపీకి 5877 ఓట్లు వచ్చాయి. మొత్తంగా టీఆర్ఎస్ 5774 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

ఇక మునుగోడులో టీఆర్ఎస్ ఆధిక్యం మరింతగా వచ్చేదే. అయితే టీఆర్ఎస్ కారు గుర్తును పోలిన కొన్ని గుర్తులు టీఆర్ఎస్ ను దెబ్బతీశాయని వాటికి వస్తున్న ఓట్లను బట్టి అర్థమవుతోంది. కారును పోలిన గుర్తులకు కూడా మంచి ఓట్లు పడడంతో కన్ఫ్యూజ్ అయ్యి జనాలు వాటికి ఓటు వేసినట్టుగా తెలుస్తోంది.

కారును పోలిన రోడ్ రోలర్ కు 904 ఓట్లు, చెప్పుల గుర్తులకు 1142 ఓట్లు, చపాతీ మేకర్ కు 1169 ఓట్లు వచ్చాయి. అసలు ఎవరో తెలియని ఈ స్వతంత్ర్య అభ్యర్థులకు వచ్చిన ఓట్లు అన్నీ టీఆర్ఎస్ వేనని.. కాబట్టి ఈ గుర్తులు లేకుంటే టీఆర్ఎస్ కు మరిన్ని ఓట్లు వచ్చేవన్న చర్చ సాగుతోంది.

కాబట్టి ఢిల్లీ నుంచి గల్లీ దాకా మోహరించిన బీజేపీకి మునుగోడు ఉపఎన్నిక భంగపాటే అని చెప్పొచ్చు. టీఆర్ఎస్ గెలుపు లాంఛనంగా అంచనావేయవచ్చు.