Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ ‘‘85’’.. కాంగ్రెస్ ‘‘45’’
By: Tupaki Desk | 16 Jan 2016 4:55 AM GMTగ్రేటర్ ఎన్నికలు మరో అంకానికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైనప్పటికీ డివిజన్ల వారీగా అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తు జాబితా విడుదలకు సమయాన్ని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షం శుక్రవారం ఒక్కరోజులోనే రెండు జాబితాల్ని విడుదల చేసింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ సంక్రాంతి పండుగ రోజున 60 మందితో తొలి జాబితాను విడుదల చేసి.. ఆపై మరో 20 మందితో ఇంకో జాబితాను విడుదల చేసింది. టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు తొలి జాబితాను విడుదల చేశారు. కొత్త పాత కలయికతో రూపొందించిన ఈ జాబితాలో పార్టీ కోసం కష్టపడిన వారికే దక్కిందని చెప్పుకొచ్చారు. మహిళలకు పెద్ద పీట వేసినట్లుగా పేర్కొన్నారు. మొదట 60 మందితో కూడిన జాబితాను విడుదల చేసిన టీఆర్ఎస్.. శుక్రవారం రాత్రి వేళ 20 మందితో మరో జాబితాను విడుదల చేసింది. దీంతో రోజు వ్యవధిలోనే 80 డివిజన్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లైంది.
ఇక.. కాంగ్రెస్ విషయానికి వస్తే.. 45 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. టీఆర్ఎస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాసేపటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. దీంతో.. ఒక్కరోజులోనే అత్యధికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన పార్టీగా తెలంగాణ అధికారపక్షం అవతరించింది. జాబితా విడుదల విషయంలో పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్న వేళ.. మిగిలిన పార్టీలతో పోలిస్తే.. టీఆర్ఎస్ లో ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లుగా కనిపించక మానదు.