Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోరు ఎంత తీవ్రమంటే?
By: Tupaki Desk | 30 Sep 2019 4:55 AM GMTతెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచిన నేపథ్యంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో.. ఆ స్థానంలో తాజాగా ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. ఈ ఎన్నికను తెలంగాణ అధికారపక్షం టీఆర్ ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. తమ సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంటే.. తమ ఉనికిని చాటుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంతో కేసీఆర్ సర్కారుకు షాకివ్వాల్సిన అవసరం ఉందంటూ పలువురు బరిలోకి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎవరికి వారికి హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రతిష్ఠాత్మకంగా మారటంతో తుది ఫలితం తమకు అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్న వైనం.. ఈ ఎన్నిక వేడిని మరింత పెంచుతోంది. ఎంతమంది పోటీలో ఉన్నా.. అంతిమంగా ఈ ఎన్నిక టీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని చెప్పక తప్పదు.
అయితే.. బరిలో నిలిచిన మిగిలిన వారు.. ఏ పార్టీ ఓటు బ్యాంకును దెబ్బ తీస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. కొత్త లెక్కల్ని తెర మీదకు తెస్తున్నాయి. టీఆర్ ఎస్ ఇప్పటికే నియోజకవర్గంలోకి భారీ ఎత్తున తన బలాగాల్ని రంగంలోకి దించి.. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ కూడా తన బలగాల్ని బరిలోకి దించాయి. ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
సామాజికంగా చూస్తే.. ఈ నియోజకవర్గంలో రెడ్లు.. లంబాడీ.. మాదిగ.. గౌడ్.. యాదవ్.. మున్నూరు కాపు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయని చెప్పాలి. ఈ సామాజిక వర్గాల ఓట్లు దగ్గర దగ్గర 1.25 లక్షల వరకు ఉంటాయని తెలుస్తోంది. దీంతో.. ఏ కులానికి సంబంధించిన ఆ కులాన్ని ప్రభావితం చేసేలా పార్టీలు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఇక.. నియోజకవర్గంలో ఉన్న పెరిక.. కమ్మ.. వెలమ సామాజిక వర్గాలకు సంబంధించి మరో 20వేల ఓట్లు ఉన్నట్లుగా చెబుతున్నారు.
అభ్యర్థులు భారీగా బరిలోకి దిగటంతో ప్రధాన అభ్యర్థులైన టీఆర్ ఎస్.. కాంగ్రెస్ కు సంబంధించి ఎవరు ఎవరికి నష్టం చేస్తారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంకు 80వేలకు పైగా ఉన్న నేపథ్యంలో.. వారు ఎటు మొగ్గితే తుది ఫలితం సానుకూలంగా మారుతుందని చెబుతున్నారు. అంతిమంగా హుజూర్ నగర్ ఓటర్లు తమ తీర్పును ఎలా ఇస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.