Begin typing your search above and press return to search.
కూకట్ పల్లి 100 కోట్లు ఏమయ్యాయి?
By: Tupaki Desk | 8 Dec 2018 9:34 AM GMTతెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గం కూకట్ పల్లి. నందమూరి కుటుంబం నుంచి సుహాసిని బరిలో ఉండటం ఇందుకు ప్రధాన కారణం. సుహాసిని గెలుపును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆమెకు అన్ని విధాలా సహకరించాలంటూ తెలంగాణ టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు - సుహాసినిని ఓడించడం ద్వారా చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పాలని భావించిన టీఆర్ ఎస్ కూడా తమ అభ్యర్థి గెలుపు కోసం పట్టుదలతో కృషి చేసింది.
పోలింగ్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ కూకట్ పల్లిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. టీ కొట్టులు - హోటళ్లు.. ఇలా ఎక్కడ చూసినా జనం ఒక విషయమే చర్చించుకుంటున్నారు. ఆ వంద కోట్లు ఏమయ్యాయి? వంద కోట్లు పంచేశారా? అంత డబ్బు ఎక్కడికి పోయింది?
కూకట్ పల్లిలో ప్రధాన పోటీ టీఆర్ ఎస్ - ప్రజా కూటమి మధ్యే. అందుకు తగ్గట్లే ప్రచార పర్వం హోరెత్తింది. సుహాసిని తరఫున చంద్రబాబు - బాలయ్య ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ ఎస్ అభ్యర్థి తరఫున కేటీఆర్ స్వయంగా ప్రచారానికి విచ్చేశారు. ప్రచార గడువు ముగిశాక నియోజకవర్గంలో భారీగా డబ్బు చేతులు మారిందని.. ప్రజా కూటమి - టీఆర్ ఎస్ పోటీ పడి ఓటర్లకు డబ్బులు పంచాయని పలువురు చెబుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇచ్చారని అంటున్నారు. ప్రజా కూటమి - టీఆర్ ఎస్ కలిసి ఏకంగా రూ.100 కోట్లు పంచి పెట్టాయని సూచిస్తున్నారు.
ఈ వంద కోట్ల విషయం ఇప్పుడు ఒక్క కూకట్ పల్లిలోనే కాదు రాష్ట్రమంతటా చర్చనీయాంశమవుతోంది. ఒక్క సీటు కోసం అంత భారీగా డబ్బు ఖర్చు చేశారా అంటూ అంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు. రూ.100 కోట్లను నిజంగానే జనానికి పంచారా? లేక ఆ లెక్కలు చూపిస్తూ స్థానిక నేతలే వాటిలో సింహభాగాన్ని జేబులో వేసుకున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.