Begin typing your search above and press return to search.
టీడీపీ.. టీఆర్ ఎస్ అభిమానులు ఇద్దరు ఫుల్ హ్యాపీ!
By: Tupaki Desk | 23 May 2019 8:15 AM GMTపరీక్షలో ఓడితే ఓడాం. కానీ.. మన ప్రత్యర్థి కూడా ఓడిపోతే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం టీడీపీ.. టీఆర్ ఎస్ అభిమానులు.. కార్యకర్తల పరిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉండటం విశేషం. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఓటమిని టీడీపీ ఫ్యాన్స్ కోరుకుంటే.. టీడీపీ ఓటమిని టీఆర్ ఎస్ అభిమానగణం ఆకాంక్షించారు.
ఊహలకు అందని రీతిలో ఈ రెండు పార్టీల అభిమానులు కోరుకున్నవి జరగటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఏపీలో టీడీపీ ఓటమిని కాంక్షించారు టీఆర్ఎస్ అభిమానులు. బాబుకు బుద్ధి రావాలంటే ఈసారి దారుణంగా ఓడిపోవాలన్న మాట గులాబీ బ్యాచ్ లో బలంగా వినిపించింది. అందుకు తగ్గట్లే దారుణమైన రీతిలో టీడీపీ ఓటమిపాలైంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు తాజా ఎన్నికలు భారీ షాకివ్వాలన్న ఆకాంక్షను పసుపు బ్యాచ్ కోరుకుంది. తమ ఓటమికి పావులు కదుపుతున్న కేసీఆర్ కచ్ఛితంగా ఓటమి పాలవ్వాలని.. ఈ ఎన్నికల ఫలితాలు ఆయనకు షాకివ్వాలని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లే.. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో 2014లో వచ్చిన సీట్ల కంటే తక్కువ రావటం ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ కుమార్తె కవితను ఓడిస్తూ నిజామాబాద్ ఓటర్లు ఇచ్చిన తీర్పుతో పచ్చ బ్యాచ్ విపరీతమైన ఆనందానికి గురి అవుతోంది. ఇరు వర్గాల వారు.. ఓడితే ఓడాం.. ప్రత్యర్థి కూడా ఓడాడు... అంతకు మించి కావాల్సిందేముంది? అంటూ చేసుకుంటున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయని చెప్పక తప్పదు.