Begin typing your search above and press return to search.

తుది జాబితా వ‌చ్చేసింది..రేప‌టి నుంచే గులాబీ దళ‌ప‌తి హోరు

By:  Tupaki Desk   |   18 Nov 2018 4:33 PM GMT
తుది జాబితా వ‌చ్చేసింది..రేప‌టి నుంచే గులాబీ దళ‌ప‌తి హోరు
X
టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్కంఠకు తెర‌దించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ ఎన్నిక‌ల్లో కీల‌క ప‌ర్వాన్ని పూర్తి చేశారు. పెండింగ్‌ లో ఉన్న అభ్య‌ర్థుల జాబితాను ఖ‌రారు చేశారు. 119 నియోజకవర్గాలకు విడతల వారీగా 117 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కేసీఆర్ ఉత్కంఠ‌ను రేకెత్తించిన రెండు స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. కోదాడ - ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల జాబితాలో పెండింగ్‌ లో పెట్టగా నవంబర్ 19వ తేదీ నామినేషన్ గడువుకు చివరి రోజు కావడంతో నవంబర్ 18వ తేదీ ఆదివారం సాయంత్రం ఆ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. టీఆర్‌ ఎస్ అభ్యర్థుల తుది జాబితాను కేసీఆర్ ఇవాళ విడుదల చేశారు. కోదాడ స్థానం నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ - ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్‌ కు టికెట్లను కేటాయించారు.

ముషీరాబాద్ - కోదాడ నియోజకవర్గాల బరిలో నిలిచేది ఎవరో గులాబీ బాస్ ప్రకటించేశారు. అందరూ ఊహించినట్లే ముషీరాబాద్ స్థానం ముఠా గోపాల్ - కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్‌ లకు కేసీఆర్ కేటాయించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం అభ్య‌ర్థిగా టీఆర్‌ ఎస్‌ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్‌ - హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస రెడ్డి పోటీ పడ్డారు. అయితే, ముఠా గోపాల్‌ వైపు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మొగ్గు చూపారు. టికెట్ దక్కించుకోవడం నాయినీ తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. చివరకు కేసీఆర్ రంగంలోకి దిగి నచ్చచెప్పడంతో నాయినీ మెత్తబడినట్లు సమాచారం.

మ‌రోవైపు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తున్న కోదాడ నియోజక వర్గంపై కూడా కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించి మహాకూటమి వ‌ల్ల టికెట్ కోల్పోయిన బొల్లం మల్లయ్య యాదవ్‌ కు అవకాశం ఇచ్చారు. ఈ ద‌ఫా ఉత్త‌మ్ స‌తీమ‌ణిని ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న టీఆర్ ఎస్ నియోజకవర్గంలో పట్టున్న మ‌ల్ల‌య్య‌ యాద‌వ్‌ కు అవ‌కాశం ఇచ్చార‌ని తెలుస్తోంది. కాగా క‌స‌రత్తు ముగిసిన నేప‌థ్యంలో సోమ‌వారం నుంచి కేసీఆర్ ప్ర‌క‌టించారు.