Begin typing your search above and press return to search.

చేరిక‌ల‌తో టీఆర్ ఎస్..బౌన్స‌ర్ల‌తో కాంగ్రెస్ హ్యాపీ

By:  Tupaki Desk   |   19 Nov 2018 6:28 AM GMT
చేరిక‌ల‌తో టీఆర్ ఎస్..బౌన్స‌ర్ల‌తో కాంగ్రెస్ హ్యాపీ
X
తెలంగాణ‌ భ‌వ‌న్‌...గాంధీభ‌వ‌న్‌. ఈ రెండు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య‌మైన రాజ‌కీయ పార్టీల కార్యాల‌యాలు. ఒకటేమో అప‌ద్ధ‌ర్మ స‌ర్కారు సార‌థ్యం వ‌హిస్తూ...ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో గెలుపు త‌మ‌దేన‌నే ధీమాతో ఉన్న పార్టీకి చెందిన కేంద్ర‌ కార్యాల‌యం. మ‌రొక‌టేమో..రాష్ట్రం ఏర్పాటు ప్ర‌యోజ‌నం ద‌క్క‌ని అత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న మ‌రో పార్టీ రాష్ట్ర కార్యాల‌యం. ఈ రెండు పార్టీల మ‌ధ్యే...ప్ర‌స్తుతం అధికార పీఠం కోసం పోరాటం అనేది అంద‌రికీ తెలిసిన సంగ‌తే. అయితే, ఈ రెండు పార్టీలు విభిన్న‌మైన వాతావ‌ర‌ణంలో చూప‌రుల‌ను దృష్టిలో ప‌డుతున్నాయి. ఇత‌ర పార్టీల నేత‌ల చేరిక‌ల‌తో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం క‌ల‌క‌ల‌లాడుతుంటే..... అంత‌ర్గ‌త అసంతృప్తుల‌కు భ‌య‌ప‌డి బౌన్స‌ర్ల‌తో కాంగ్రెస్ కార్యాల‌యం బిక్కుబిక్కుమంటోంది.

ముంద‌స్తు ఎన్నిక‌లకు తెర‌లేపిన గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఈ క్ర‌మంలో 105 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దానికి కొన‌సాగింపుగా మిగ‌తా 14 స్థానాల అభ్య‌ర్థుల‌ను వివిధ ద‌శ‌ల్లో ప్ర‌క‌టించారు. అయితే, ఈ పార్టీలో అసంతృప్తులు వ్య‌క్త‌మైనా...అవి రాష్ట్ర కార్యాలయం వ‌ద్ద‌కు చేరిన దాఖ‌లాలు లేవు. మ‌రోవైపు కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ - కాంగ్రెస్‌ - సీపీఐ - టీజేఎస్ జ‌ట్టుక‌ట్టాయి. ఉమ్మ‌డిగా పోటీ చేసే కార్యాచర‌ణ‌ను రూపొందించాయి. అయితే, పొత్త‌ల ప‌ర్వంలో టికెట్లు ద‌క్క‌ని నేత‌లు పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ తీరును దుయ్య‌బ‌డుతూ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేస్తున్నారు. నామినేష‌న్ల‌కు ఒక్క‌రోజు ముందు కూడా ఇదే ప‌ర్వం క‌నిపించింది. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో చొప్పదండి - వేములవాడ - వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు - వారి అనుచరులు పెద్దసంఖ్యలో ఆదివారం తెలంగాణభవన్‌ కు తరలివచ్చి మంత్రి కేటీఆర్ - ఎంపీ వినోద్‌ కుమార్ సమక్షంలో టీఆర్‌ ఎస్‌ లో చేరారు.

ఇక కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం ప‌రిస్థితి చిత్రంగా ఉంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యాల‌య‌మైన గాంధీభవ‌న్ బౌన్స‌ర్లు - ఆందోళ‌న‌కారులు త‌ప్ప‌....ముఖ్య‌నేత‌లు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. టికెట్ల కేటాయింపులో బీసీల‌కు అన్యాయం చేశార‌ని - సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోలేద‌ని - పార్టీకి చేసిన కృషిని లైట్ తీసుకున్నార‌ని...ఇలా వివిధ రూపాల్లో ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్న‌వారంతా గాంధీభ‌వ‌న్ వ‌ద్ద గంద‌ర‌గోళం సృష్టిస్తున్న ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో త‌మ పార్టీ కార్యాలయానికి ర‌క్ష‌ణ‌గా ప్ర‌భుత్వ పోలీసులు - ప్రైవేటు బౌన్స‌ర్ల‌తో కాంగ్రెస్ కార్యాల‌యం ర‌క్షించ‌బ‌డుతోంది. స్థూలంగా...చేరిక‌ల‌తో టీఆర్ ఎస్ కార్యాల‌యం క‌ల‌క‌ల‌లాడుతుంటే...కాంగ్రెస్ కార్యాల‌యం మాత్రం నేత‌ల సంద‌డి లేక వెల‌వెల‌బోతోంది.