Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ భారీ ప్లాన్.. ఎన్నికలకు ముందే..
By: Tupaki Desk | 28 March 2019 6:28 AM GMTకాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ‘చేజా’రిపోతున్నారు. తాజాగా నిజామాబాద్ పూర్వపు జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను కలిసి కారెక్కారు. ఇలా ఒక్కొక్కరుగా గులాబీ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి సిద్ధమైంది.
ఫిరాయింపు దారులకు సమస్యలు తలెత్తకుండా టీఆర్ ఎస్ ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరారు. మరో నలుగురిని సమీకరించి మొత్తం కాంగ్రెస్ పార్టీనే విలీనం చేయడానికి టీఆర్ ఎస్ రంగం సిద్ధం చేసినట్లు సమచారం.
లోక్ సభ ఎన్నికల్లోపే కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ ఎస్ లో విలీనం చేసేందకు టీఆర్ ఎస్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల శాసనసభలో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కోల్పోతుంది. ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసి సునాయసంగా గెలువవచ్చని టీఆర్ ఎస్ భావిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. మూడింట రెండొంతుల మంది ఉంటే 14 మంది టీఆర్ ఎస్ లో కలిస్తే ఫిరాయింపుల చట్టం వారికి వర్తించదు. వారు అనర్హత వేటుకు గురికారు. దీనివల్ల కాంగ్రెస్ ఫిర్యాదు చేసినా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే టీఆర్ ఎస్ లో కొనసాగే వీలు ఉంటుంది. అందుకే ఎన్నికలకు ముందే మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లోకి లాగి వెంటనే విలీన ప్రక్రియను పూర్తిచేయాలని కేసీఆర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.
ఇటీవలే శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం టీఆర్ ఎస్ లో విలీనమైంది. గత శాసనసభలోనూ తెలుగుదేశం పార్టీ కూడా ఇలాగే టీఆర్ ఎస్ లో విలీనమైంది. ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ ను విలీనం చేసేందుకు కేసీఆర్ స్కెచ్ గీశారు. మరి తెలంగాణ ప్రతిపక్షం కాంగ్రెస్ ఎలా స్పందిస్తుదనేది ఆసక్తిగా మారింది.