Begin typing your search above and press return to search.
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రకటన
By: Tupaki Desk | 7 Oct 2022 7:32 AM GMTసుధీర్ఘ కసరత్తు తర్వాత తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మునుగోడు అభ్యర్థిని ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ముందునుంచి అందరూ ఊహించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే బరిలోకి దించారు. 2014 ఎన్నికల్లో మునుగోడులో కూసుకుంట్ల ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఇప్పుడు మరోసారి బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీపడుతుండగా.. కాంగ్రెస్ నుంచి పాల్వాయి లక్ష్మీ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
ఇక టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం చేసిన కేసీఆర్ ఈరోజు నామినేషన్లు మొదలు కావడంతో ఎట్టకేలకు ప్రకటించారు.
మునుగోడులో దాదాపు 70శాతానికి పైగా బీసీలు ఉన్నారు. ఈసారి బీసీకే టికెట్ ఇద్దామని కేసీఆర్ చాలా ట్రై చేశారు. సర్వేలు చేయించారు. కానీ బీసీ క్యాండిడేట్ కంటే ప్రభాకర్ రెడ్డికే ఎక్కువ మద్దతు లబించడంతో ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు.
మునుగోడు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఈనెల 10న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నామినేషన్ కు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి హాజరు కానున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.