Begin typing your search above and press return to search.
కారు జోరు.. ఫలితాలకు ముందే క్లీన్ స్వీప్
By: Tupaki Desk | 21 Jan 2019 12:30 PM GMTఅసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, పంచాయితీ ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ కనిపిస్తోంది. తెలంగాణలో ఈ రోజు జరిగిన తొలి దశ పంచాయితీ ఎన్నికల్లో రిజల్ట్ రాకముందే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది తెలంగాణరాష్ట్ర సమితి. 4479 పంచాయితీల్లో ఈరోజు ఎన్నికలు జరిగితే.. వీటిలో 769 గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికజరిగింది. అంటే.. పోలింగ్ జరగకుండానే గ్రామ ప్రజలు ఒక సభ్యుడ్ని సర్పంచిగా ఏకగ్రీవంగాఎన్నుకున్నారన్నమాట.
ఈ ఏకగ్రీవ ఎన్నికల్లో 769 పంచాయితీలకు గాను, 610 పంచాయితీల్లో టీఆర్ ఎస్ జయకేతనం ఎగరవేసింది. ఇక మిగతా పంచాయితీల్లో ప్రస్తుతం కౌంటింగ్ నడుస్తోంది. తాజా ఫలితాల ప్రకారం.. వీటిలో 90శాతం పంచాయితీల్లో టీఆర్ ఎస్ గెలిచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దాదాపు 3వేలపంచాయితీల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు.
నిజానికి గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగవు. కారు, హస్తం గుర్తులు ఎక్కడా కనిపించవు. కానీ పోటీ చేసే అభ్యర్థులు ఏ పార్టీకి చెందినవారు అనే విషయం అందరికీ తెలుసు. సదరు పార్టీలు సర్పంచ్ అభ్యర్థులకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తుంటాయి. తుది ఫలితాలు ఈరోజురాత్రి 9 గంటలకు వచ్చే అవకాశం ఉంది.