Begin typing your search above and press return to search.
అధికార పార్టీ కార్పొరేటర్ ను నరికి చంపేశారు
By: Tupaki Desk | 13 July 2017 3:57 PM GMTగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కార్పోరేటర్ అనిశెట్టి మురళి (టీఆర్ ఎస్)దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు కార్పోరేటర్ మురళిపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని కుమార్ పల్లి ప్రాంతంలోని ఇంట్లో ఉన్న మురళిపై దుండగులు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి చేరిన కార్పొరేటర్ అనిశెట్టి మురళీని దుండగులు వేట కొడవళ్లు, తల్వార్లతో పైశాచిక దాడి చేసి చంపేశారు. అనంతరం దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం జనార్దన్ అనే వ్యక్తి హత్య చేసులో మురళీ నిందితుడని, ఆయన కొడుకులే పగబట్టి చంపారని ప్రాథమిక నిర్ధారణ చేశారు.
ఇటీవల టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి చేరిన కార్పొరేటర్ అనిశెట్టి మురళీని ఆయన ప్రత్యర్థులు టార్గెట్ చేశారని సమాచారం. 25 ఏళ్ల క్రితం జనార్దన్ హత్య చేసులో మురళీ నిందితుడని.. జెన్నీ కొడుకులే పగబట్టి చంపారని ప్రాథమిక నిర్ధారణ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున జనార్దన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. గురువారం (జులై 13) హన్మకొండలో భారీ వర్షం కారణంగా ఎటు వెళ్లకుండా మురళి ఇంట్లోనే ఉన్నారు. అదే అదనుగా చూసుకొని వారు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.