Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ అభిమానులు ! జర భద్రం కొడుకో !

By:  Tupaki Desk   |   4 May 2022 12:30 AM GMT
టీ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ అభిమానులు ! జర భద్రం కొడుకో !
X
రాజ‌కీయ పార్టీల‌న్నింటికీ ఏదో ఒక్క ప్ర‌త్యేక‌త ఉంటుంది. అవి ఉనికిలో ఉన్నంత ఒక కిలో పొగ‌రుతోనో, అర కిలో విన‌యంతోనో ఉంటాయి. ఉండాలి కూడా! కానీ కొన్ని సార్లు పొగ‌రు కాస్త మారి పైత్యానికి దారి తీయొచ్చు. పైత్యం కాస్త ముదిరి ప్ర‌కోపానికి తావివ్వ‌వ‌చ్చు. ఏం చేసినా కూడా అదంతా రాజ‌కీయంలో భాగంగానే చూడాలి.

ఆ విధంగా పార్టీల న‌డ‌క మ‌రియు శైలి అన్న‌వి విభిన్నం అయి ఉంటాయి. ఉండాలి కూడా ! ఆ కోవ‌లో ఆ తోవ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఉంది.మంచికో చెడుకో కానీ కొన్ని విష‌యాల్లో ప్ర‌త్యేక‌త‌ల‌ను క‌లిగి ఉంది. మంచి ప‌రంగా కొంత చెడుప‌రంగా ఇంకొంత ప్ర‌త్యేక రాష్ట్రంలో ఎనిమిదేళ్ల పాటు అధికారం పూర్తి చేసి ఏలుబ‌డి చేసింది. పెత్తందారీ వ్య‌వ‌స్థ కొంత ఉన్నా కూడా త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో తెలంగాణ వాదం వినిపించిన పార్టీగానే,తెచ్చిన పార్టీగానే ప్ర‌జ‌లు అక్క‌డ ఆ పార్టీకి జై కొడుతున్నారు.

కొంత అక్ర‌మ ప‌ద్ధ‌తి కొంత గూండాయిజం కూడా ఉంది.ఆ రోజు ప్ర‌త్యేక ఉద్య‌మాల్లో క‌ర్ర ప‌ట్టుకుని వీరంగం చేసిన దానం నాగేంద‌ర్ లాంటి నాయ‌కుల‌కూ, కాస్త తల పొగ‌రుగామాట్లాడే త‌ల‌సాని శ్రీ‌నివాస్ లాంటి నేత‌ల‌కూ అస్స‌లు లోటే లేద‌ని త‌రుచూ కాంగ్రెస్ వ‌ర్గీయులు వారి మ‌ద్ద‌తు దారులు అంటుంటారు.

ఆ రోజు ఉద్య‌మంలో లేక‌పోయినా క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ప్ర‌తినిధుల‌కు మంచి ప‌ద‌వులే ఇచ్చి గౌర‌వించార‌ని ఇవాళ్టికీ వాళ్లంతా చంద్ర‌బాబు ఏజెంట్లేన‌ని విప‌క్షంతో స‌హా చాలా మంది ఆరోపించారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా టీఆర్ఎస్ -లో కమ్యూనిస్టు పార్టీ సానుభూతిప‌రులు ఉన్న విధంగా, కాంగ్రెస్-లో కూడా తెలంగాణ రాష్ట్ర స‌మితి సానుభూతి ప‌రులున్నారు. వారే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని కీల‌క ప‌రిణామాలు కూడా అధికార పార్టీ గూటికి చేర‌వేస్తార‌న్న అనుమానాలు గ‌తంలో వెలుగు చూశాయి కూడా !

ఇదిలా ఉంటే రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఇప్పుడో కీల‌క పరిణామం చోటు చేసుకోనుంది. ఓయూలో స‌భ పెట్టుకునేందుకు ఆయ‌న‌కు అనుమ‌తి లేక‌పోవ‌డంతో ఈ విష‌య‌మై జ‌గ్గారెడ్డి వెళ్లి కేసీఆర్ ను క‌లుస్తాను అంటున్నారు. అదేవిధంగా కొన్ని సార్లు జ‌గ్గారెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌ల‌ను పొగిడిన సంద‌ర్భాలూ ఉన్నాయి.

పొగిడిన నోటితోనే తిట్టిన చంద‌గా ఇవాళ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ ఆయ‌న తిట్టారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ అభిమానులు చాలా పై స్థాయిలో ఉన్న నాయ‌కులే కావడం ఆశ్చ‌ర్య‌క‌రం. వీటిపై పాపం రేవంత్ రెడ్డి మాట్లాడ‌రు. ఎందుకంటే ఆయ‌న కూడా కేసీఆర్ కు స‌న్నిహితుడే అన్న‌ది బీజేపీ మ‌రియు ఇంకా కొన్ని పార్టీల ఆరోప‌ణ.