Begin typing your search above and press return to search.
హుజురాబాద్ పై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ .. మొదలైన రాజకీయ తుఫాన్!
By: Tupaki Desk | 2 Jun 2021 12:30 PM GMTఅవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రిమండలి నుండి భర్తరఫ్ చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓవైపు టీఆర్ ఎస్ పార్టీని వీడి ఈటల బిజెపిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే మాజీ మంత్రి ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ కావటంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. హుజురాబాద్ లో ఉపఎన్నిక తథ్యం అనే చర్చ నియోజకవర్గం లో మొదలైంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన గులాబీ పార్టీ, పూర్తి పట్టు కోసం శర వేగంగా పావులు కదుపుతోంది.
హుజురాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికలో టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థే గెలిచేలా ఇప్పటికే నేతలు బాధ్యతలు తీసుకోని గ్రౌండ్ లెవల్ లో తమ పనిని మొదలుపెట్టేశారు. ఈటెల బీజేపీలోకి వెళ్లడం ఖాయం అవ్వడంతో అధికార పార్టీ నేతలు విమర్శల జోరు పెంచారు. ఈటలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. పల్లా కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు డీకే అరుణ, కేసీఆర్ మెప్పు కోసం పనిచేసే టీఆర్ ఎస్ నేతలకు ఆత్మే లేదని గౌరవం ఎక్కడనుంచి వస్తుందని ఎద్దేవా చేశారు. మొత్తానికి హుజురాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ టీఆర్ ఎస్ జెండా ఎగురవేయాలని గట్టి వ్యూహమే రచిస్తోంది. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు హైకమాండ్ ఆదేశాలను క్షేత్రస్థాయిలో నేతలు అమలు చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా అక్కడ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈటల ప్రజలతో మంచి సంభందాలు కలిగి ఉన్నారు. ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపోమాపో దానికి ఆయన రాజీనామా చేయడమా, లేక పార్టీనే ఆయన్ను సస్పెండ్ చేయడమా, జరిగిపోతుంది. ఇక్కడ ఎన్నికలు రావడం అనేది ఏదైనా అనుకోని సంఘటనలు, రాజకీయమార్పులు జరిగితే తప్ప అనివార్యం. దీనితో ఇప్పటినుండే టిఆర్ ఎస్ గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది.