Begin typing your search above and press return to search.
అచ్చంపేట క్లీన్ స్వీప్ గేమ్ ప్లాన్ ఇదేనా?
By: Tupaki Desk | 11 March 2016 10:08 AM ISTఎన్నిక ఏదైనా.. గంపగుత్తగా ఒకే పార్టీనే మొత్తం సీట్లు గెలుచుకోవటం చాలా అరుదుగా జరిగే పరిణామం. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 20 డివిజన్లు ఉండగా... తెలంగాణ అధికారపక్షం క్లీన్ స్వీప్ చేయటం తెలిసిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఎన్నికల సందర్భంగా తెలంగాణ అధికారపక్షానికి షాక్ ఇచ్చేందుకు.. విపక్షాలు మొత్తం కలిసి మహాకూటమిగా మారి బరిలోకి దిగి... టీఆర్ ఎస్ హవాకు చెక్ చెప్పాలని చూశారు.
ఇదిలా ఉంటే.. ఓటర్ల తీర్పు అనూహ్యంగా మారి విపక్షాల నోట వెంట మాట రాని పరిస్థితి. మొత్తం 20 స్థానాల్లో ఒక్క స్థానంలోనూ విపక్షాలు విజయం సాధించకపోవటంతో.. ఇలాంటి విజయం టీఆర్ ఎస్ కు ఎలా సాధ్యమైందన్న సందేహం ఇప్పుడు పలువురికి కలుగుతోంది. దీంతో.. అచ్చంపేటలో తెలంగాణ అధికారపక్షం ఏం చేసిందన్న విషయం మీద నిశితంగా దృష్టి సారించినప్పుడు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
అచ్చంపేట ఎన్నికను ఇద్దరు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఎన్నికల సందర్భంగా వారు అనుసరించిన వ్యూహాత్మక వైఖరి విపక్షాలకు షాక్ ఇచ్చింది. ఎన్నిక ఏదైనా.. ప్రచారం పూర్తి అయిన తర్వాత చోటు చేసుకునే పరిణామాలు చాలా కీలకంగా మారతాయి. అందుకే.. ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారం ముగిసిన తర్వాత హడావుడి మొదలవుతుంది. పగలు కంటే రాత్రిళ్లు కార్యకలాపాల జోరు భారీగా ఉండటంతో పాటు.. కీలక నిర్ణయాలకు వేదికగా ఉంటుంది.
సరిగ్గా ఈ పాయింట్ నే తెలంగాణ అధికారపక్షం వినియోగించినట్లు చెబుతున్నారు. తాము తప్ప విపక్ష నేతలు ఎవరూ రాత్రిళ్లు అడ్డదిడ్డంగా ప్రచారం చేసే ఛాన్స్ ఇవ్వకుండా లోకల్ పోలీసులు వ్యవహరించిన తీరు ఎన్నికల ఫలితంపై తీవ్ర ప్రభావం చూపించిందని చెబుతున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంతో వణికిపోయిన విపక్షాలు ప్రచార అనంతర కార్యక్రమాలు చేపట్టేందుకు వణికిపోయారు. దీన్నోఅవకాశంగా మార్చుకున్న అధికారపక్షం చెలరేగిపోయిందని.. దీనికితోడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీదున్న సానుకూలత ఓట్ల వర్షం కురిపించిందని తెలుస్తోంది. దీంతో పాటు మరో కీలకమైన హామీ కూడా టీఆర్ ఎస్ తిరుగులేని విజయానికి కారణమైందని తెలుస్తోంది. అచ్చంపేటలో అధికారపక్షాన్ని గెలిపించిన పక్షంలో దాదాపుగా 2000 వేల డబుల్ బెడ్ ఇళ్లను కేటాయిస్తామన్న పక్కా హామీ ఎన్నికల ఫలితాల స్వరూపాన్నే మార్చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.