Begin typing your search above and press return to search.

భట్టి విక్రమార్కతో టీ ఆర్ ఎస్‌ కు వ్యూహాలకు చెక్‌

By:  Tupaki Desk   |   19 Jan 2019 11:26 AM GMT
భట్టి విక్రమార్కతో టీ ఆర్ ఎస్‌ కు వ్యూహాలకు చెక్‌
X
రాష్ట్ర స్థాయిలో నేతలకు ఎన్ని గొడవలు ఉన్నా, 20 మంది ఎమ్మెల్యేల్లో ప్రతీ ఒక్కరూ సీఎల్పీ లీడర్‌ పదవి కోసం పోటీపడినా.. కొన్ని వ్యూహాల్లో కాంగ్రెస్‌ పార్టీ ముందు అందరూ బలాదూరే. వందేళ్ల పైబడిన చరిత్ర కలిగిన పార్టీతో గేమ్స్‌ ఆడితే అంతే. కాంగ్రెస్‌ అధినాయకత్వం టీఆర్ ఎస్‌ లాంటి స్థానిక పార్టీల్ని ఎన్ని చూసి ఉండదు. అందుకే.. మల్లు భట్టి విక్రమార్క రూపంలో కేసీఆర్‌ కు అదిరిపోయే రేంజ్‌ లో చెక్‌ పెట్టింది. ఉత్తమ్‌, శ్రీధర్‌ బాబు, డీకే అరుణ్‌ లాంటి హేమాహేమీలున్నా కూడా సీఎల్పీ లీడర్‌ గా మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం ఇచ్చారు. దీని వెనుక కాంగ్రెస్‌ పార్టీ అద్భుతమైన ప్లాన్నింగ్‌ ఉంది.

వాస్తవానికి అసెంబ్లీలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది కేసీఆర్‌ ప్లాన్‌. అందుకోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను ఆపరేషన్‌ ఆకర్ష్‌ లో భాగంగా తమ పార్టీలోకి తీసుకోవాలని ప్లాన్‌ చేశారు. ఉత్తమ్‌కు సీఎల్పీ ఇస్తే కోమటిరెడ్డి వర్గం రెబల్స్‌ గా మారతారు. కోమటిరెడ్డికి ఇస్తే.. డీకే అరుణ వర్గం ఫైర్‌ అవుతారు. అందుకే ఎవ్వరికీ కాకుండా దళితుడైన మల్లు భట్టి విక్రమార్కకు ఇచ్చారు. భట్టికి ఇవ్వడం వల్ల ఒక్క కాంగ్రెస్‌ లీడర్‌ కూడా నోరెత్తలేదు. హైమాండ్ నిర్ణయమే తమ నిర్ణయం అని సైలెంట్‌ అయ్యారు.

ఇక అన్నింటికి మించి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. మొదటిసారి చెయ్యెలేదు. రెండో సారి పుల్‌ మెజారిటీ వచ్చినా కూడా ఇచ్చిన హామీ నేరవేర్చుకోలేదు. ఇలాంటి టైమ్‌లో భట్టిని సీఎల్పీ లీడర్‌ గా ఎంపిక చేసి కాంగ్రెస్‌ పార్టీ దళితుల పక్షాన ఉంటుందని సంకేతాలు పంపించింది. ఒకవేళ భట్టిని సీఎల్పీ లీడర్ కాకుండా టీఆర్ ఎస్‌ ప్రయత్నాలు చేసుంటే.. ఒక దళితుడ్ని ముఖ్యమంత్రిగా చేయరు.. కనీసం సీఎల్పీ లీడర్‌ గా కూడా ఉండనివ్వరా అనే వాదన బయటకు తెచ్చేది. దీంతో.. దళిత ఓట్‌ బ్యాంక్‌ మొత్తం ఎక్కడ పార్టీకి దూరం అవుతుందనే ఉద్దేశంతో కేసీఆర్‌ సైలెంట్‌ అయ్యారు. పనిలోపనిగా కాంగ్రెస్‌ వాళ్లు తేలుకుట్టిన దొంగల్లా గమ్మునుండిపోయారు. అంటే.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట.