Begin typing your search above and press return to search.
ఉద్యమ పార్టీ.. ప్రభుత్వం ఒకటేనా!?
By: Tupaki Desk | 9 July 2015 5:30 PM GMTఉద్యమ పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు! ప్రభుత్వం ఎక్కడైనా ప్రభుత్వమే! సీమాంధ్రలో అయినా దాని స్వరూప స్వభావాలు ఒకేలా ఉంటాయి. తెలంగాణలో అయినా ఒకేలా ఉంటాయి! చివరికి అమెరికాలో అయినా ఒకేలా ఉంటాయి. నియంతృత్వానికి నిదర్శనమైన దేశాల్లోనూ దాని స్వరూప స్వభావాలు అలాగే ఉంటాయి. కానీ, తెలంగాణ విషయంలో కొత్త రాష్ట్రం ఏర్పడినా ఏడాది దాటిన తర్వాత కూడా ఈ వాస్తవాన్ని తెలంగాణవాదుల్లో అత్యధికులు గుర్తించలేకపోయారని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.
పీఆర్‌సీ అమలు కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వారి సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. తమ డిమాండ్ల సాధనకు రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వారిని పట్టించుకునే దిక్కు లేదు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. వారి విషయంలో స్పందన శూన్యం. ఒకప్పుడు నైనాల గోవర్ధన్ గొప్ప తెలంగాణవాది. ఇప్పుడు ఆయన సన్నాసి.. పిచ్చివాడు! ఒకప్పుడు కోదండరామ్ ఉద్యమాన్ని ఉర్రూతలూగించినా.. ఇప్పుడు ఎవరికీ కొరగానివాడు! ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో గాథలు!
ఉద్యమ పార్టీకి లక్ష్యమే ముఖ్యం. ఆ లక్ష్య సాధనలో అది అందరినీ కలుపుకొనిపోవాలి. అందరినీ దగ్గరకు చేర్చుకోవాలి. తాను ఏమాత్రం కష్టపడకుండా అందరితో ఉద్యమం చేయించాలి. వాళ్లంతా రోడ్డు మీద పోరాటాలు చేస్తే ఆ క్రెడిట్‌ను తాను అందుకోవాలి. కానీ, ప్రభుత్వ లక్ష్యం వేరు. అందరూ తనకు కావాలనుకుంటే ప్రభుత్వం నడవలేదు. ప్రభుత్వానికి కొందరితోనే పని. అందరినీ కలుపుకొనిపోవాలనుకుంటే సాధ్యం కాదు కూడా. ఇక్కడ అధికారం ఉంటుంది కనక తాను చెప్పింది మిగిలిన వాళ్లు వినాలి. అంతే తప్ప మిగిలిన వాళ్లు చెప్పిన దానిని ప్రభుత్వం ఎన్నడూ వినదు. ప్రభుత్వానికి, ఉద్యమ పార్టీకి ఉన్న మౌలిక వ్యత్యాసం ఇదేనని, దీనిని గుర్తించడంలో తెలంగాణ వాదులు ఏడాదిపాటు వృథా చేశారని, ఇప్పటికీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా కాకుండా టీఆర్‌ఎస్ అధినేతగా చూడడమే వారు చేసిన తప్పని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ప్రభుత్వం వేరు.. ఉద్యమ పార్టీ వేరు.. ముఖ్యమంత్రి వేరు.. కేసీఆర్ వేరు.. కేసీఆర్ వేరు.. తెలంగాణ వేరు.. తెలంగాణ ప్రయోజనాలు వేరు.. కేసీఆర్ ప్రయోజనాలు వేరు అనే వాస్తవాలను గుర్తించాలని, ఇప్పటికీ గుర్తించకపోతే ఇటువంటి అవమానాలు పునరావృతం అవుతూనే ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు.