Begin typing your search above and press return to search.
అప్పులు తెచ్చుడు ఓకే..తీర్చుడు ఎట్లా కేసీఆర్
By: Tupaki Desk | 13 Nov 2017 4:34 AM GMTతెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మహా చిత్రంగా కనిపిస్తాయి. ఎవరూ ప్రజల గురించి.. వారికి ఎదురయ్యే సమస్యల గురించి పెద్దగా మాట్లాడినట్లు కనిపించదు. ఎంతసేపటికి ఒకరి మీద ఒకరు రాజకీయ పరమైన విమర్శలు చేసుకోవటం.. సవాళ్లు విసురుకోవటం కనిపిస్తుందే తప్పించి.. పాలకులు చేస్తున్న తప్పుల్ని నిర్మాణాత్మకంగా ఎత్తి చూపించే పనిలో ఉన్నట్లుగా కనిపించవు.
అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో ఏకంగా రూ.75వేల కోట్లు అప్పు చేయటంపై తెలంగాణ విపక్షం పెద్దగా తప్పు పట్టింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 60ఏళ్లు కలిసి కాపురం చేస్తేనే.. విడిపోయేటప్పుడు వచ్చిపడ్డ అప్పులు రూ.75 వేల కోట్ల కంటే కాస్త ఎక్కువని.. కానీ మూడున్నరేళ్ల వ్యవధిలో ఇంత భారీ మొత్తం అప్పుల ఖాతాలోకి వెళ్లిపోవటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నోళ్లు అస్సలు కనిపించరు.
స్వల్ప వ్యవధిలో ఇంత భారీగా అప్పులు చేయటాన్ని అధికారపక్షం లైట్ గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథ కార్యక్రమాల కోసం భారీ ఎత్తున నిధుల్ని ఖర్చు చేస్తున్నారు. మరింత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్న వేళ.. అందుకు తగ్గ ఫలితం వచ్చిందా? లేదా? అన్న అంశంపై కూడా ఇప్పటివరకూ ఎలాంటి చర్చ జరిగింది లేదు. ఈ లోపాలపై తాజాగా దుమ్మెత్తి పోశారు టీపీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క.. తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసిన అప్పుల మీద ప్రత్యేక దృష్టిని సారించారు.
ఆరు దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు రూ.70వేల కోట్లు అప్పులు చేస్తే.. టీఆర్ ఎస్ సర్కారు తన పదవీ కాలంలో ఇప్పటివరకూ రూ.75 వేల కోట్లు ఖర్చు చేయటాన్ని ప్రశ్నించారు.
ఈ అప్పును తెచ్చే క్రమంలో రానున్న 30 ఏళ్లపాటు బడ్జెట్ నిధులను వాణిజ్య బ్యాంకులకు తాకట్టు పెట్టిన విషయాన్ని బయటకు తెచ్చారు. మౌలికవసతుల పేరిట ఇంత భారీగా ఖర్చు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మరణశాసనంలోకి నెడుతున్నట్లుగా ఆరోపించారు. భట్టి అడిగారని కాకున్నా.. ఇంత భారీ ఎత్తున అప్పులు తెచ్చారు సరే.. మరి వీటిని ఎలా కట్టాలన్న అంశంపైనా బ్లూప్రింట్ ఏమైనా ఉందా? అన్నది సందేహం. అలాంటిదేమీ లేకుండా ఇష్టారాజ్యంగా అప్పులు చేసి ఉంటే మాత్రం.. సంపన్న రాష్ట్రమన్న ట్యాగ్ లైన్ కు నవ్విపోవటం ఖాయం.