Begin typing your search above and press return to search.
హైదరాబాదీల్లో కేసీఆర్ పై కోపం పెరిగిపోతోందట
By: Tupaki Desk | 14 Oct 2017 12:36 PM GMTఔను - సాక్షాత్తు....టీఆర్ ఎస్ పార్టీ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే ఆ పార్టీకి చెందిన నాయకులు గుర్రుగా ఉన్నారు. అందులోనూ రాజధాని హైదరాబాద్ కు చెందిన పార్టీ నేతలు తమ నాయకుడి నాడి తెలుసుకోలేకపోతున్నారు. రికార్డు స్థాయి విజయం అందించినప్పటికీ...తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తి తారాస్థాయికి చేరుతోందట. ఇదంతా...గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అధికార టీఆర్ ఎస్ పార్టీ నేతల ఫీలింగ్. పార్టీ - నామినేటెడ్ పదవుల భర్తీ గురించి. టీఆర్ ఎస్ రాష్ట్ర కమిటీని ఇటీవల ఆ పార్టీ అధినేత - సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉండటంతో క్యాడర్ లో ఉత్సాహం పెరిగింది. దీంతో త్వరలో జిల్లా కమిటీలు - నామినేటెడ్ పదవులను ప్రకటిస్తారనే ఆశలు చిగురించాయి. కానీ అలాంటి ముందడుగు ఏదీ పడకపోవడంతో పార్టీ నేతలే నారాజ్ అయిపోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి - సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుతో గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ క్యాడర్ వేగంగా పెరిగింది. సాధారణ ఎన్నికల నాటికి అంతంత మాత్రంగా ఉన్న టీఆర్ ఎస్ పరిస్థితి అధికారం వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు - కార్పొరేటర్లు - మాజీ ప్రజాప్రతినిధులు - కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. దీంతో 2015 - 2017లో పార్టీ చేపట్టిన సభ్యత్వం కేవలం గ్రేటర్ హైదరాబాద్ లోనే పదిలక్షలు దాటింది. 2015లో గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షునిగా మైనంపల్లి హన్మంతరావును ప్రకటించారు. ఆ తర్వాత పూర్తిస్థాయి కమిటీని వేయడానికి అధ్యక్షుని హోదాలో జాబితాను సిద్ధం చేసినా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో రెండు సంవత్సరాల పాటు కమిటీని ప్రకటించకుండానే కాలం వెళ్లదీశారు. అయినా పార్టీ అధ్యక్షుని హోదాలో మైనంపల్లి హన్మంతరావు పార్టీ కార్యకర్తలను - నాయకులను కలుపుకొని ముందుకు సాగుతూ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జీహెచ్ ఎంసీపై గులాబీ జెండాను ఎగుర వేయగలిగారు. రెండు సంవత్సరాల పాటు కమిటీ లేకుండా సాగగా - 2017లో తిరిగి పార్టీ సభ్యత్వాలు రికార్డుస్థాయిలో చేశారు.
2017 ఏప్రిల్ - మే నెలల్లో సభ్యత్వం - కమిటీల ఏర్పాటు పూర్తయితే ఇప్పటికీ గ్రేటర్ కు పార్టీకి కమిటీని ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. టీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో అధిష్టానం నిర్లక్ష్యం చేస్తుం దని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సభ్యత్వం సేకరించడం వరకు చూపిన ఉత్సాహాన్ని కమిటీల ప్రకటన విషయంలో చూపించడం లేదని కార్యకర్తలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌లో మునుపెన్నడూ - ఏ పార్టీకి ఇవ్వనంత సొంత మెజార్టీ కట్టబెట్టితే తమకు దక్కిన ప్రతిఫలం ఇదా అని వాపోతున్నారు. పార్టీ కమిటీలు - నామినేటెడ్ పదవుల ప్రకటనలకు నేడో రేపో అంటు తాత్సారం చేస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కమిటీలను ప్రకటిస్తూ ముందుకు నడిపిన టీఆర్ ఎస్ అధిష్టానం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పార్టీని బలోపేతం చేసే విషయంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.