Begin typing your search above and press return to search.
తుమ్మలకు పొగబెట్టడం మొదలైందా?
By: Tupaki Desk | 19 Aug 2016 5:30 PM GMTతెలంగాణ క్యాబినెట్ లో సీఎం కెసిఆర్ తర్వాత తనది రెండో స్థానమంటూ ప్రకటన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అధికార పార్టీలో కుంపటి మొదలయిందా? నామినేటెడ్ పదవులను కట్టబెట్టడంలో టీఆర్ ఎస్ వేస్తున్న అడుగులే ఇందుకు నిదర్శనమనా? జంపింగ్ నాయకుల్లో మొదట తలసానికి ఎదురైన అనుభవమే ఇపుడు తుమ్మలకు ఎదురవుతోందా? అంటే అవుననే సమాధానం ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల నుంచి వినవస్తోంది.
తెలంగాణలో ఒకపుడు టీఆర్ ఎస్ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలలో ఖమ్మం మొదటి స్థానంలో ఉండేది. పార్టీ ఆవిర్భవించి రాష్ట్ర ఏర్పాటు జరిగేంత వరకు ఇక్కడ ఆ పార్టీ ఖాతా తెరవలేదు. అనంతరం సీనియర్ నేత తుమ్మలను పార్టీలోకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీ నుండి పోటీచేసి ఓటమి పాలైన ఆయనను టీఆర్ ఎస్ అధినేత - సీఎం కేసీఆర్ పట్టుబట్టి ఎమ్మెల్సీ చేసి మరీ తెలంగాణ క్యాబినెట్ లోకి చేర్చుకున్నారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాలో టీడీపీకి చెందిన బలమైన వర్గమంతా గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే అదే సమయంలోనే తుమ్మల వ్యతిరేకవర్గమంతా ఒక్కటై సీఎం కేసీఆర్ ను కలిశారు. రాజకీయంగా దశాబ్దాలుగా ఆయనతో ఉన్న వైరాన్ని ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. వారందరికి ఓదార్చిన ఆయన అందరి రాజకీయ భవిష్యత్ కు తనదే భరోసా అని హమీ ఇచ్చారు. పార్టీ పదవులు - నామినేటెడ్ పదవుల పంపిణీలో జరిగే అన్యాయాన్ని ముందే పూసగుచ్చినట్టు వివరించారు. అయితే పార్టీ బలోపేతం కోసం ఆయనను తీసుకుంటున్నామని వారిని సముదాయించారు. కొద్దిరోజులకే జరిగిన క్యాబినెట్ విస్తరణలో ఆయన కు మంత్రిగా అవకాశమిచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉన్న అసలు రాజకీయం ఇక్కడే మొదలైంది. పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలలో తుమ్మలను రంగంలోకి దింపిన అధిష్ఠానం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెంటనే పార్టీలోకి రప్పించింది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ టీఆర్ ఎస్ గూటికి చేరుకున్నారు. అంతకుముందే వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు - కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యలు పార్టీ మారిన వారి జాబితాలో ఉన్నారు. పొంగులేటితో పాటు మిగిలిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడ గులాబీ గూటికి చేరారు. దీంతో జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేలకు గాను ఏడుగురు అధికార పార్టీకి చెందిన వారు ఉన్నట్లయింది.
ఇదిలాఉండగా...జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులకు పదవులు ఇప్పించేందుకు రంగంలోకి దిగారు. దీనిని గమనించిన ఆయన వ్యతిరేక వర్గం తుమ్మలకు చెక్ పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. అందులో బాగంగానే ఖమ్మం కార్పోరేషన్ మేయర్ గా పాపాలాల్ పేరు ఖరారైంది. సీఎం కేసీఆర్ కూడా తొలి నుండి పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడంతో తప్పని పరిస్థితులలో తుమ్మల ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగిలిన పదవుల పంపకాలలోను ఇదే ఫార్ములాను అనుసరించేందుకు తుమ్మల వ్యతిరేక వర్గం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ఖమ్మం జిల్లా రాజకీయాలలో అధికార టీఆర్ ఎస్ పార్టీలో చీలిక స్పష్టంగా కనపడుతుందని అంటున్నారు. తుమ్మలతో పాటు పార్టీలో చేరిన టిడిపి నేతలు ఒక వర్గంగా ఉండగా టీడీపీకి వ్యతిరేకంగా పోరాడి టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు మరోవర్గంగా ఉన్నారు. ఇందులో తుమ్మల వ్యతిరేక వర్గానకి సీనియర్ నేత జలగం వెంకట్రావుతో పాటు ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. తుమ్మల కోటరీలో ముఖ్యనేతలుగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ - గడిపల్లి కవిత - కొండబాల కోటేశ్వరరావు - మదన్ లాల్ లు ఉన్నారు.
ఆయా నియోజకవర్గాలలో ఉండే నామినేటెడ్ పదవుల పంపిణీలో ఎమ్మెల్యేలదే తుది నిర్ణయమని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో ఆ పదవుల పందేరంలో తుమ్మల జోక్యం చేసుకోవడం లేదు. జిల్లా స్థాయిలో ఉండే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ - గ్రంథాలయ సంస్థ - భద్రాచలం ఆలయ కమిటీ వంటి కీలక పదవుల విషయంలో టీఆర్ ఎస్ అధిష్ఠానం కూడా వేరే నేతవైపు మొగ్గు చూపతుండంతో తుమ్మల కూడ ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇక మంత్రి కేటీఆర్ తో ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తరచూ సమావేశమవుతూ తన అనుచరులకు న్యాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. తుమ్మల తన సామాజిక వర్గానికి చెందిన వారికి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం పై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ అది తీరడం లేదని అంటున్నారు. పలు సందర్బాలలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కూడ ఆయన ఆగ్రహనికి కారణమైందట. వెరసి తుమ్మలకు చెక్ పెట్టే పనిలో ఇటు అధిష్ఠానం - అటు టీఆర్ ఎస్ నేతలు మూకుమ్మడిగా రంగంలోకి దిగారనే ప్రచారం ఖమ్మం జిల్లాలో విస్తృతంగా జరుగుతుంది.