Begin typing your search above and press return to search.

బీజేపీ బలం.. మజ్లిస్ బలహీనత టీఆర్ ఎస్సే

By:  Tupaki Desk   |   25 July 2019 11:09 AM GMT
బీజేపీ బలం.. మజ్లిస్ బలహీనత టీఆర్ ఎస్సే
X
అంతా టీఆర్ ఎస్ వల్లే.. మజ్లిస్ వెనుకబడడానికి, బీజేపీ పుంజుకోవడానికి టీఆర్ ఎస్సే కారణమట.. ఇప్పుడు ఇదే ఆవేదన మజ్లిస్ నేతల్లో వ్యక్తమవుతోందట. టీఆర్ ఎస్ తో దోస్తీతో ముందుకెళితే తమ ఓటు బ్యాంకు అంతా గులాబీకి షిఫ్ట్ అవ్వడం ఇప్పుడు ఎంఐఎం నేతలను కలవరపెడుతోంది. సరే మజ్లిస్ కు ఓట్లు వేయలేదు సరే.. దాని స్థానంలో టీఆర్ ఎస్ వల్ల బీజేపీకి ఓటు బ్యాంకు చీలడమే ఎంఐఎం కొంపులు ముంచుతోందంటున్నారు.

ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్ లలో కొన్నేళ్ల క్రితం ఎంఐఎం ఉనికి ఉండేది. ఆ పార్టీ ఈ కార్పొరేషన్లలో డిప్యూటీ వైస్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునేది. హంగ్ లో ఆదిలాబాద్ పురపాలికను కైవసం చేసుకుంది. సికింద్రాబాద్ లోనూ ముస్లిం ఓట్లు చాలా ఎక్కువ. అయితే ఇది గతం.

టీఆర్ ఎస్ తో దోస్తీ కట్టిన మజ్లిస్ హైదరాబాద్ లోని 7 అసెంబ్లీ , ఒక పార్లమెంట్ సీటును గెలుచుకుంది. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ముస్లింలకు చేపట్టిన సంక్షేమ పథకాలు, మైనార్టీ గురుకులాలు , షాదీ ముబారక్ వంటి పథకాల వల్ల ఎంఐఎం, ముస్లిం ఓటు బ్యాంకు మొత్తం టీఆర్ ఎస్ కు షిఫ్ట్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు వేసిన వీరంతా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి వేయలేదు. ఓట్లు చీలి బీజేపీకి చాలా క్రాస్ ఓటింగ్ జరిగి ఆదిలాబాద్- కరీంనగర్- నిజామాబాద్ లో బీజేపీ గెలిచింది.

అందుకే ఇప్పుడు మిత్రుడు కదా అని గులాబీ పార్టీకి మద్దతిచ్చిన ఎంఐఎంకు ఓటు బ్యాంకులో భారీగా నష్టం జరిగిందంటున్నారు. ముస్లిం ప్రాబల్లమున్న కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్ నగరాల్లో అసలు ఉనికే లేకుండా పోయిందట.. ఇక్కడ బీజేపీ బలపడడం ఆ పార్టీని కలవరపెడుతోంది. అందుకే ఇటీవల ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. ఎంఐఎంకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు కానీ బీజేపీకి వేయవద్దని పిలుపునిచ్చాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.